Intinti Gruhalakshmi: పార్టీ నుంచి వెళ్లిపోయిన తులసి.. తులసికి నందుతో సారీ చెప్పించిన సామ్రాట్..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి పాట పాడుతూ ఉండగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి పాట పాడినందుకు సామ్రాట్ గొప్పగా పొగుడుతూ ఉంటాడు. సామ్రాట్ మాటలకు తులసి కుటుంబ సభ్యులు సంతోష పడుతూ ఉండగా లాస్య, నందు మాత్రం కోప్పడుతూ ఉంటారు. అప్పుడు తులసి,నందు తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అనసూయ దంపతులు తులసి విషయంలో మేము చాలా తప్పు చేశాము అని సామ్రాట్ కి చెప్పుకుంటూ పశ్చాత్తాప పడుతూ ఉంటారు.

అప్పుడు అనసూయ తులసి గురించి మాట్లాడుతూ తులసి ఒక గొప్పతనం వివరిస్తుంది. ఆ తర్వాత ప్రేమ్,అభి లు చిన్నచిన్నగా మాట్లాడుకుంటూ పోట్లాడుతూ ఉండడంతో వెంటనే సామ్రాట్ ఈరోజు పార్టీ మొదలుపెట్టిన వేల విశేషం బాగాలేదు ఏమో అందుకే చిన్న చిన్న విషయాలు ఎక్కడికో వెళ్తున్నాయి అని అంటాడు. అప్పుడు నందు వాళ్ళ బాబాయ్ తులసికి తన భర్త సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని అనడంతో నందు ఏం మాట్లాడకుండా మౌనంగా తల దించుకుంటాడు.

అప్పుడు తులసి భర్త గురించి అక్కడ టాపిక్ రావడంతో తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ పదేపదే తులసి భర్త గురించి అడగడంతో తులసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు తులసి పార్టీకి పిలిచినందుకు థాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత తులసి పార్టీలో జరిగిన విషయాలను తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వస్తాడు. అప్పుడు తులసిని కి నచ్చే చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రేమ్. కానీ తులసి మాత్రం జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి పరంధామయ్య వచ్చి తులసికి సపోర్ట్ గా మాట్లాడుతాడు. అప్పుడు తులసి జరిగిన విషయాల గురించి మరింత బాధపడుతూ ఉండగా పరంధామయ్య తులసీకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.

ఇవన్నీ కూడా దేవుడు నీకు పరీక్షలు పెడుతూ నీకు మంచి చేస్తున్నాడు అని ప్రేమ్,పరంధామయ్య ధైర్యం చెబుతారు. ఆ తర్వాత నందు ఒంటరిగా కూర్చుని పార్టీలో జరిగిన విషయాల గురించి తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి లక్కీ ఆడుకుంటూ వస్తాడు. అప్పుడు లక్కీ తన మాటలతో విసిగించడంతో నందు కోప్పడతాడు. అప్పుడు లక్కీ తన బొమ్మను సామ్రాట్ కొనిచ్చాడు అనడంతో నందు కోపంతో పగలగొడుతూ ఉండగా ఇంతలో లాస్య వచ్చి అడ్డుపడుతుంది.

అప్పుడు నందు కోప్పడుతూ ఉండగా లాస్య పద్ధతి మార్చుకో నందు అని అంటుంది. నందు, పదేపదే సామ్రాట్ గురించి తెలుసుకొని రగిలిపోతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో తులసి అనుకోకుండా సామ్రాట్ ఇంటికి లేటుగా రావడంతో నందు తులసి పై సీరియస్ అవుతాడు. అప్పుడు లాస్య స్వారీ చెప్పడంతో నాకు కాదు తులసికి స్వారీ చెప్పండి అని అంటాడు సామ్రాట్.