Karthika Deepam Aug 6 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య శోభ చెంప చెల్లుమనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న అక్కడికి వచ్చి ఏంటి మమ్మీ నా ఇంటికి వచ్చి నా కోడల్ని కొడుతున్నావ్ అని అనగా వెంటనే సౌందర్య నిన్ను కూడా కొడతాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఎవరే నీ కోడలు. ఇది కాదు నీ కోడలు హిమ నీకు కాబోయే కోడలు అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది ఇది ఫిక్స్ మీరు కూడా ఫిక్స్ అయిపోండి అని అంటుంది. ఆ తర్వాత స్వప్న ఎలా అయినా నేను ఈ పెళ్లిని ఆపుతాను అని అనగా వెంటనే సౌందర్య నీకు చేతనైంది చేసుకో అంటూ స్వప్నకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరొకవైపు హిమ, ప్రేమ్ లు ఎలా అయినా పెళ్లి ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ ఈ పెళ్లి ఆపితే హిమకు నా మీద మంచి అభిప్రాయం వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సౌర్య,ఆనంద్ ఎదురు టిఫిన్స్ సెంటర్ లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ శోభ అని నీ గురించి ఎవరూ వచ్చారు అని అనగా ఎందుకు వచ్చారు అని సౌర్య అడగడంతో ఏమో తెలియదు నువ్వు ఈ మధ్య ఇక్కడికి రావట్లేదు అని చెప్పాను అని అంటాడు.
Karthika Deepam Aug 6 Today Episode : శోభ మాటలకు షాక్ అయిన నిరుపమ్..
నువ్వు మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావంటే కదా అక్కడికి తీసుకొని వెళ్తావా అని అనగా అప్పుడు సౌర్య నువ్వు మోనిత కొడుకువి నిన్ను ఆ ఇంటికి ఇప్పుడు తీసుకొని వెళ్తే ఎవరూ పట్టించుకోరు అని మనసులో అనుకుంటుంది. మరొకవైపు శోభ, స్వప్న దగ్గరికి వచ్చి నిరుపమ్, హిమ ల పెళ్లి పనులు తొందరగా జరుగుతున్నాయి అని అనగా వారిద్దరూ నవ్వుకొని మనకు ఎక్కువ భారం లేకుండా పెళ్లి పనులు జరిగిపోతున్నాయి అని అనుకుంటారు. ఇంతలోనే నిరుపమ్ అక్కడికి ఆపుతారా అంటూ గట్టిగా వారిపై సీరియస్ అవుతాడు.
మా మమ్మీ సంగతి పక్కన పెట్టు నీకేమైంది శోభ అని అనగా మీ మామయ్య కార్తీక్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట కదా,పేరు మోనిత. తన పోలికలే నాకు వచ్చాయి నేను కూడా అస్సలు వదలను అని అంటుంది శోభ. అప్పుడు నిరుపమ్ నేను హిమనే ప్రేమిస్తున్నాను హిమనే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెబుతాడు. మరొకవైపు సౌర్య ఒంటరిగా నిల్చోని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆనంద్ రావు వస్తాడు.
అప్పుడు ఆనందరావు నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి చేయలేకపోతున్నాను అని అనగా వెంటనే సౌర్య నీకోసం నేను ఇంట్లో ఉంటున్నాను ఈ పెళ్లి అయిపోగానే వెళ్ళిపోతాను మీకు సంతోషమే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ్, తండ్రి సత్యం దగ్గరికి వెళ్లి నిరుపమ్ పెళ్లి ఆపడానికి సలహా అడగగా అప్పుడు సత్యా ప్రేమ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సౌందర్య, హిమకు నిరుపమ్ కు పెళ్లి చేస్తున్నందుకు సౌందర్య దంపతుల ఆశీర్వాదాలు తీసుకోవాలి అనుకుంటాడు నిరుపమ్. ఇంతలోనే స్వప్న అక్కడికి వచ్చి శోభతో పాటు ఆశీర్వాదాలు తీసుకో అని అంటుంది. అప్పుడు స్వప్న నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు మీ అమ్మమ్మ తాతయ్యలు అని అంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World