Inspiring story : ఆ అమ్మాయి ఒకప్పుడు అనాథ. పుట్టగానే అమ్మాయి అని తెలియడంతో ఆ తల్లిదండ్రులు వదిలించుకున్నారు. కానీ ఇప్పుడామె ప్రపంచంలోనే గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగింది. ఎన్నో రికార్జ్స్ బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా లాంటి జట్టుకు తురుపు ముక్కలా నిలిస్తోంది. ఆమె పేరు లిసా సెల్కర్.. పుట్టింది భారత్ లో, వదిలేయబడింది భారత్ లో, అనాథగా మారింది కూడా భారత్ లోనే. కానీ పెరిగి పెద్దయింది మాత్రం అమెరికాలో. మేటి క్రికెటర్ గా ఎదిగింది ఆస్ట్రేలియాలో.
అసలు లైలా కథ ఏంటంటే.. అది 1979వ సంవత్సరం ఆగస్టు 13 ఓ అమ్మాయిని మహారాష్ట్ర పుణేలోని ఓ అనాథ శరణాలయంలో వదిలిపెట్టారు. ఆ అనాథాశ్రమం వారే ఆ అమ్మాయికి లైలా అనే పేరు పెట్టారు. ఆ చిన్నారి లైలాను ఓ అమెరికన్ జంట దత్తత తీసుకుంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం దత్తత తీసుకుని అమెరికాకు వెళ్లారు. లైలా పేరును లిసా సెల్కర్ గా మార్చారు. తర్వాత వారు అమెరికా నుండి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిర పడ్డారు.
లిసా సెల్కర్ కు చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే ఇష్టం. దత్తత తీసుకున్న తల్లిదండ్రులూ ఆమెను ప్రోత్సహించారు. ఆమెకు ఇష్టమైన ఆటలో మేటి క్రికెటర్ గా ఎదిగింది లిసా సెల్కర్. లిసా ఇప్పటి వరకు 8 టెస్టులు, 25 వన్డేలు, 54 టీ-20 మ్యాచ్ లో ఆడింది. ఐసీసీ ర్యాంకింగ్ లో ప్రపంచ నంబర్ వన్ ఆల్ రౌండర్ గా ఎదిగింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెగా చేసి 2013లో క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది.