PF Balance Check : EPFO ఇప్పుడు PF బ్యాలెన్స్ చెక్ చేయడాన్ని సులభతరం చేసింది. మీకు స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ లేకపోయినా మిస్డ్ కాల్, SMS లేదా వాట్సాప్ సాయంతో మీరు ఇప్పటికీ PF బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. ఇంటర్నెట్ లేనప్పుడు బ్యాలెన్స్ చెకింగ్ చేయాల్సిన ఉద్యోగులకు ఈ సౌకర్యం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
PF బ్యాలెన్స్ చెక్ చేసేందుకు ఇప్పుడు మీరు EPFO వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు కొన్ని సెకన్లలో మీ PF అకౌంట్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు. ఈ మూడు మార్గాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా చెక్ చేయొచ్చు.
1. SMS ద్వారా PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
EPFO సభ్యులు SMS పంపడం ద్వారా PF బ్యాలెన్స్ సమాచారాన్ని పొందవచ్చు. మీరు EPFOలో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి ఈ కింది ఫార్మాట్‌లో SMS పంపాలి. మీరు EPFOHO UAN TEL అని టైప్ చేయాలి. ఇక్కడ “UAN” మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్, “TEL” లాంగ్వేజీని సూచిస్తుంది.
Read Also : Shortest Day : భూమి వేగం పెరిగింది.. ఇకపై రోజుకు 24 గంటలు ఉండదు.. రోజు ఎందుకు తగ్గుతోందంటే?
ఈ నంబర్‌కు SMS పంపండి :
PF బ్యాలెన్స్ చెక్ చేయడానికి మీరు 7738299899కు మెసేజ్ పంపాలి. కొన్ని సెకన్లలో మీ PF అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను SMS ద్వారా పంపుతారు. ఈ సర్వీసు 10 కన్నా ఎక్కువ భాషలలో అందుబాటులో ఉంది. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మొదలైనవి. మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోతే లేదా UAN యాక్టివ్ లేకపోతే, HR లేదా కంపెనీ నుంచి సాయం తీసుకోండి.
2. మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
మిస్డ్ కాల్ ద్వారా కూడా PF బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. ఇందుకోసం మీరు 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీ మొబైల్ నంబర్ EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి. UAN యాక్టివేట్ అయి ఉండాలి. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ చేసిన వెంటనే కాల్ ఆటోమాటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. కొన్ని సెకన్లలో మీరు SMS ద్వారా PF బ్యాలెన్స్ వివరాలను పొందవచ్చు.
3. వాట్సాప్ ద్వారా PF బ్యాలెన్స్ చెక్ చేయండి :
EPFO కూడా వాట్సాప్ సర్వీసును ప్రారంభించింది. తద్వారా మీరు చాట్ ద్వారా మీ PF అకౌంట్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. మీ ప్రాంతీయ EPFO ఆఫీసు వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేయండి. చాట్‌లో “Hi” లేదా “PF Balance” అని టైప్ చేయండి. తక్కువ సమయంలోనే మీ PF బ్యాలెన్స్, ఇతర వివరాలను ఈపీఎఫ్ఓ పంపుతుంది. ఈ PF Balance లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా మీ ప్రాంతీయ EPFO నంబర్‌ను తెలుసుకోవచ్చు.