Shortest Day : రాబోయే రోజుల్లో భూమిలో అతిపెద్ద మార్పు జరగబోతోంది. గత ఐదు ఏళ్లుగా భూమి భ్రమణ వేగం పెరుగుతోందని పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. 2020 సంవత్సరం నుంచి భూమి దాని అక్షం మీద సాధారణం కన్నా వేగంగా తిరుగుతోంది. దీని కారణంగా, ప్రపంచం చరిత్రలో అతి తక్కువ రోజును చూడవచ్చు. అంటే.. రోజు 24 గంటల కన్నా తక్కువగా ఉంటుంది.
ఈ అతి తక్కువ రోజు ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో జరగవచ్చు. ఖగోళ శాస్త్రవేత్త గ్రాహం జోన్స్ అతి తక్కువ రోజులకు సంబంధించి మూడు తేదీలను వెల్లడించారు. 2025 సంవత్సరంలో జూలై 9 లేదా జూలై 22న లేదా వచ్చే నెల ఆగస్టు 5న జరగవచ్చు. భూమిపై చంద్రుని కక్ష్య ప్రభావం వల్ల ఇది జరుగుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ రోజు సాధారణ రోజు కన్నా 1.66 మిల్లీసెకన్ల కన్నా తక్కువగా ఉంటుందని అంటున్నారు.
Shortest Day : రోజు ఎందుకు తగ్గుతోంది? :
సౌర దినం సరిగ్గా 24 గంటలు ఉండాలి. కానీ, భూమి భ్రమణం ఎప్పుడూ పూర్తిగా స్థిరంగా లేదు. అధ్యయనం ప్రకారం.. 2020లో భూమి వేగంగా తిరగడం ప్రారంభించింది. రోజు సమయాన్ని తగ్గించింది. అయితే, భూమి వేగంగా తిరగడానికి కారణం శాస్త్రవేత్తలకు తెలియదు.
2021 సంవత్సరంలో ఒక రోజు తక్కువగా నమోదైంది. ఇది సాధారణం కన్నా 1.47 మిల్లీసెకన్లు తక్కువ. 2022లో 1.59 మిల్లీసెకన్లు తగ్గింది. ఆ తరువాత జూలై 5, 2024న కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 24 గంటల కన్నా 1.66 మిల్లీసెకన్లు తక్కువ.
Read Also : Vastu Tips : ఆర్థిక ఇబ్బందులా? మీ ఇంట్లో ఈ 4 మొక్కలు ఉంటే అంతా అదృష్టమే.. డబ్బులు వద్దన్నా వస్తూనే ఉంటాయి..!
2025 సంవత్సరంలో జూలై 9, జూలై 22 లేదా ఆగస్టు 5 అంచనా వేసిన తేదీలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుని కక్ష్య భూమి, భూమధ్యరేఖ నుంచి చాలా దూరంలో ఉన్నప్పుడు భూమిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
పగటిపూట 24 గంటల కన్నా తక్కువ సమయం పడుతుంది. చంద్రుని కారణంగా బిలియన్ల సంవత్సరాలుగా భూమి భ్రమణ వేగం తగ్గుతోందని అధ్యయనం తెలిపింది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు 3 నుంచి 6 గంటల వరకు ఉండేది. కానీ, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమిపై ఒక రోజు 24 గంటలు ఉండేది.
ఆందోళన కలిగించే విషయమా?
రోజులో కొన్ని మిల్లీసెకన్లు తగ్గడం వల్ల సాధారణ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే, సాంకేతికత, టెలికమ్యూనికేషన్‌కు ఇది చాలా ముఖ్యం. భూమి ఈ ధోరణిలో కొనసాగితే.. దాదాపు 50 బిలియన్ సంవత్సరాలలో భూమి భ్రమణం చంద్రుని కక్ష్యతో కలిసి పోతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అప్పుడు చంద్రుడు ఎల్లప్పుడూ భూమి ఒక భాగంలో మాత్రమే కనిపిస్తాడు. ఆ సమయానికి భూమిపై ఇంకా చాలా మార్పులు జరుగుతాయని అంచనా.