Thammudu Movie Review : యంగ్ హీరో నితిన్ మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి తమ్ముడు అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. దిల్ రాజు (Thammudu Movie Review) నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చింది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అయిన తమ్ముడు మూవీ మరి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
నటీనటులు (Cast & Crew) :
నితిన్, వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ, సౌరబ్ సచ్ దేవ్, స్వస్తిక విజయ్
నిర్మాత : శిరీష్
సినిమాటోగ్రాఫర్స్ : సత్యజిత్ పాండే, సమీర్ రెడ్డి, కె.వి గుహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మ్యూజిక్ : అజినీష్ లోక్నాథ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వేణు శ్రీరామ్
Thammudu Movie Review : స్టోరీ (Story) :
హీరో నితిన్ (జై) ఆర్చర్.. చిన్నతనం నుంచే అర్చరీలో ట్రైనింగ్ పొందుతాడు. దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలని తపిస్తాడు. ఈ క్రమంలో బుల్స్ ఐ మిస్ పదేపదే మిస్ అవుతాడు. ఆ సమస్య ఏంటో తేలేవరకు ప్రయత్నించొద్దని కోచ్ చెబుతాడు. దాంతో ఆ సమస్య పరిష్కారం కోసం జై ప్రయాణం మొదలువుతుంది.
చిన్నతనంలో అక్క ఝాన్సీ (లయ)కి జరిగిన అన్యాయం జైకి గుర్తుకు వస్తుంది. అక్క కోసం తమ్ముడు బయల్దేరుతాడు. అప్పటికే అక్క కుటుంబం ఏదో ప్రమాదంలో చిక్కుకుని ఉంటుంది. ఆమె కుటుంబాన్ని కాపాడేందుకు జై ప్రయత్నిస్తాడు. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు (Nithin Movie Review) ఏం చేశాడు? ఎలా ఆమెకు అండగా నిలబడతాడు అనేది మూవీ అసలు స్టోరీ లైన్..
ప్రభుత్వ అధికారితో తప్పుడు సంతకాలు చేయించుకోవాలని విలన్ ప్రయత్నిస్తుంటాడు. ఆ తమ్ముడే జై (నితిన్). అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేస్తాడు అనేది మూవీలో చూడాలి. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. టెక్నికల్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టాడు.
మ్యూజిక్ పరంగా సినిమా బాగుంది. కానీ, సింగిల్ డే స్టోరీ విషయంలోనే వేణు శ్రీరామ్ మిస్ ఫైర్ అయినట్టే. అక్క ఊరికి వెళ్లడం సమస్యలలో ఇరుక్కోవడం, ప్రజలకు ఇచ్చిన మాట తీర్చకపోవడం, అది తెలిసి తమ్ముడు అక్క మాట కోసం ఊరికి వచ్చి ఆశయాన్ని తీర్చడం వంటి సినిమాలో చూడొచ్చు.

హీరోగా నితిన్ నటన పరంగా మెప్పించాడు. లయ కీలక పాత్రలో పోషించింది. అక్క పాత్రకు న్యాయం చేసింది. చిన్న పాప పాత్ర బాగుంది. హీరోయిన్లు వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. లేడీ విలన్ స్వస్తిక విజయ్ మెప్పించారు. కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్ దేవ్ కూడా మంచిగా నటించారు.
మ్యూజిక్ ఒక్కటే సినిమాకు బలం. అజనీష్ లోక్నాథ్ సక్సెస్ అయ్యాడు. పాటల కన్నా బ్యాగ్రౌండ్ స్కోరు బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా వండర్. సినిమా మొత్తం అడవిలోనే సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా తమ్ముడు మూవీ (Thammudu Movie Review in Telugu) మళ్లీ మిస్ ఫైర్ అయినట్టుగా అనిపించింది. ఏది ఏమైనా తమ్ముడు సినిమా థియేటర్‌కు వెళ్లి చూస్తేనే ఆ మ్యాజిక్ అర్థమవుతుంది.