Hero nithin: యంగ్ హీరో నితిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవలే నటించిన లేటెస్ట్ సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంలో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈగస్టు 12న ఈ చిత్రం గ్రాండ్ రిీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం నితిన్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూల్లో నితిన్ సినిమా గురించి చాలా విశేషాలు తెలిపారు. మాచర్ల నియోజకవర్గం ఫిక్షనల్ స్టోరీ అని తెలిపారు. మాచర్ల టైటిల్ లో ఒక ఫోర్స్ ఉందని వివరించారు. కరోనా తర్వాత ప్రేక్షకుల మూడ్ అర్థం కాకుండా ఉందన్నారు. రాజప్ప పాత్ర కోసం సముద్రఖనికి కథ చెప్పినప్పుడు తమ ఊళ్లో కూడా ఇలాంటి కథ జరిగిందని చెప్పినట్లు వివరించారు. అయితే తన 20 ఏళ్ల కెరియర్ లో హిట్లు, ఫ్లాపులు రెండూ ఉన్నాయన్నారు. ప్రస్తుతం తన పొజిషన్ పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు వివరించారు. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలనేది తన ప్లాన్ అని తెలిపారు.
సినిమాలు ప్లాప్ అయినపుడు చాలా బాధపడేవాడినని తెలిపారు. ఇటీవలకు విక్రమ్ సినిమా చూశాక వారం రోజుల పాటు నిద్ర ప్టలేదని అన్నారు. నితిన్ కెరియర్ లో దాదాపు పదేళ్లు హిట్లు లేవు. ఇష్క్ చిత్రం నితిన్ కెరయర్ కి టర్నింగ్ పాయింట్. ఎక్కువ ప్లాపులు ఇచ్చిన హీరోలు ఎవరని గూగుల్ లో వెతకగా… హృతికో రోషన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల పేర్లు కనిపించేవన్నారు. వాళ్లను ఆదర్శంగా తీసుకునే ముందుకు సాగుతున్నట్లు వివరించారు.