Gongura Mutton Curry in Telugu : ఆంధ్ర మటన్ గోంగూర (గోంగూర మటన్ కర్రీ) ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి తిని చూడండి.. లొట్టలేసుకుని మరి తినేస్తారు.. అంత రుచిగా ఉంటుంది. మటన్ గోంగూర ఎప్పుడు (Gongura Mutton) చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే.. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మటన్ గోంగూర కోసం అర కిలో మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకోండి.
మటన్‌లో ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసే ఉప్పు కారం మటన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలపండి. ఆ తర్వాత బౌల్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మటన్‌కు ఉప్పు కారం బాగా పడతాయి. అలాగే మీడియం సైజు రెండు కట్టలు గోంగూర తీసుకోండి. శుభ్రంగా కడిగడండి. మటన్ గోంగూర కోసం ఎర్ర గోంగూరని తీసుకోండి. ఎందుకంటే.. ఎర్ర గోంగూర టేస్ట్ బాగుంటుంది.
Gongura Mutton : తయారీ విధానం :
మటన్ గోంగూర తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హాఫ్ కేజీ మటన్‌కి రెండు ఉల్లిపాయలను కట్ చేయండి. అలాగే ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ గోంగూర కోసం మసాలా పొడి చేసుకోండి. ఫ్రెష్ అయితే టేస్ట్ బాగుంటుంది.
ముందుగా పాన్లో 2 లేదా 3 టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు కూడా వేయండి. దాల్చిన చెక్క వేసేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేడి మాడకుండా దోరగా వేయించుకోండి.
ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అన్నింటిని మిక్సీ జార్ లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యానల్స్ స్టవ్ పైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొండి.
ఈ ఆయిల్ లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి లైట్‌గా వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలతో పాటు గోంగూరను కూడా వేయండి. టమాటా ముక్కలతో గోంగూర కూడా మగ్గిపోతుంది. కాసేపు ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టి పాన్ మూత పెట్టేసి గోంగూరని మెత్తగా అయ్యేంతవరకు మగ్గనివ్వండి.

కొన్ని మిరియాలు, ఒక 5 లవంగాలను పప్పు గుత్తితో కాస్త మెత్తగా అయ్యేంతవరకు దంచుకోండి. కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసికొని ఫ్లేమ్ మీ మీడియం ఫ్లేమ్ లో పెట్టండి.
Read Also : Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!
ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత 2 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి.
Gongura Mutton : మటన్ గోంగూర కర్రీకి కావలసిన పదార్థాలు :
ఆ తర్వాత మటన్ ముక్కలను కూడా వేయండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాలు బాగా వేగనివ్వండి. మటన్ లో నుంచి కొద్దిగా నీళ్లు ఊరతాయి. నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు వేయించుకోండి. ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోండి. కొంచెం టీస్పూన్ కారం కూడా వేసుకోండి.
ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. గోంగూర పులుపు ఉంటుంది.. కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. ఉప్పు, కారం ఎంత కావాలో వేసుకోండి. ఆ తర్వాత బాగా కలిపేసి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టి ఉంచండి.
10 నిమిషాల పాటు మటన్ బాగా ఉడికించాలి. మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు తీసుకున్న మటన్ కాస్త ముదురు అయితే మరో విజిల్ వచ్చేవరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసినట్టు కలపండి.
ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. కారం, మసాలా పొడి సరిపోలేదనిపిస్తే.. కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఒకవేళ మసాలా పొడి సరిపోకపోతే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అయినా వేసుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసి చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించండి.
ఐదు ఆరు నిమిషాల తర్వాత చిక్కబడుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేయాలి. మొత్తం బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. టేస్టీ టేస్టీ మటన్ గోంగూర కర్రీ రెడీ..