AP EAPCET 2025 Counselling : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ జూలై 7, 2025 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభ (AP EAPCET 2025) తేదీలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) ప్రకటించింది.
ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సులలో అడ్మిషన్లు కోరే విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, సీట్ల ఫైనల్ కేటాయింపు వంటి ముఖ్యమైన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు :
ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2025) పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 7 నుంచి జూలై 16, 2025 వరకు రిజిస్టర్ చేసుకోవాలి. జనరల్, BC కేటగిరీలకు రూ. 1200, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఉంటుంది. ఇందులో విద్యార్థులు EAPCET హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ ద్వారా లాగిన్ అవ్వాలి.
AP EAPCET 2025 : సర్టిఫికెట్ల వెరిఫికేషన్ :
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జూలై 7 నుంచి జూలై 17, 2025 వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు డిజిటల్ వెరిఫికేషన్‌ను ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వివరాలను ధృవీకరించలేని విద్యార్థులు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం (AP EAPCET 2025 Counselling Schedule) హెల్ప్‌లైన్ కేంద్రాలను సందర్శించాలి. మార్కుల డాక్యుమెంట్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, లోకల్ రెసిడెన్సీ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు ఉండాలి.
వెబ్ ఆప్షన్ల ఎంట్రీ, ఛేజింగ్ ఆప్షన్ :
సర్టిఫికేట్ల ధృవీకరణ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడానికి పిలుస్తారు. వెబ్ ఆప్షన్ల ఎంట్రీ జూలై 10 నుంచి (AP EAPCET 2025 Counselling Date) జూలై 18, 2025 వరకు తెరిచి ఉంటుంది. అభ్యర్థులు తమ ర్యాంకులు, ప్రాధాన్యతల ప్రకారం కోర్సులు, కాలేజీలను ఎంచుకోవచ్చు. జూలై 19న ఎడిట్ కోసం ఒకే రోజు సమయం ఉంటుంది. ఆ తర్వాత మీ వెబ్ ఆప్షన్లు చెక్ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ :
ఫస్ట్ రౌండ్ సీట్ల కేటాయింపును జూలై 22, 2025న లేదా ఆ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. సీటు కేటాయింపు తర్వాత అభ్యర్థి ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్‌తో జూలై 23 నుంచి జూలై 26 వరకు కాలేజీలకు స్వయంగా హాజరు కావాలి. అభ్యర్థి సకాలంలో రిపోర్ట్ చేయడంలో విఫలమైతే సీటును కోల్పోతారు.
విద్యా తరగతుల ప్రారంభం :
తాత్కాలికంగా, కొత్త సెషన్ కోసం విద్యా తరగతులు ఆగస్టు 4, 2025 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, విద్యార్థులు ఫీజు చెల్లింపులు లేదా చేరే ఫార్మాలిటీలకు సంబంధించిన గడువులను నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోవచ్చు.
వెరిఫికేషన్‌కు అవసరమైన సర్టిఫికేట్లు :
అభ్యర్థులు అడ్మిషన్ ప్రక్రియ, కౌన్సెలింగ్ కోసం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలి.
ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2025) హాల్ టిక్కెట్లు, ర్యాంక్ కార్డ్ :
10వ తరగతి, 12వ తరగతి మార్కు షీట్లు.
బదిలీ సర్టిఫికేట్ (TC).
స్టడీ సర్టిఫికెట్లు (6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు).
ఆదాయ ధృవీకరణ పత్రం (ఫీజు రీయింబర్స్‌మెంట్).
కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC ).
EWS సర్టిఫికేట్ (వర్తిస్తే)
అడ్రస్ ప్రూఫ్
ఆధార్ కార్డ్, ఇతర గవర్నెంట్ ఐడీ ప్రూఫ్
ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2025) వెబ్ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చు.