IND vs ENG 2025 : బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజున శుభ్‌మాన్ గిల్ తన కెరీర్‌లో అత్యంత చిరస్మరణీయ (IND vs ENG 2025) ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్‌పై తన టెస్ట్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో గిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ డబుల్ సెంచరీ (IND vs ENG Test) సాధించిన 3వ భారతీయుడిగా నిలిచాడు. అంతేకాదు.. మొదటి భారత కెప్టెన్‌గా కూడా అవతరించాడు.
25 ఏళ్ల 298 రోజుల వయసులో గిల్ భారత్ తరపున డబుల్ సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ అయ్యాడు. అతని కన్నా ముందు ఈ రికార్డు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి పేరిట ఉంది. 1964లో 23 సంవత్సరాల 39 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతను డబుల్ సెంచరీ సాధించిన వెంటనే గిల్ ప్రత్యేక సంబరాలు చేసుకున్నాడు. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో అతని కోసం స్టాండింగ్ ఒవేషన్ కూడా ఇచ్చారు.
IND vs ENG 2025 : కోహ్లీ తర్వాత ఇప్పుడు గిల్ పేరు :
గిల్ కన్నా ముందు భారత కెప్టెన్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రమే 7 సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ఒక్కొక్కసారి ఈ ఘనత సాధించారు. గిల్ ఈ డబుల్ సెంచరీ విదేశాల్లో భారత కెప్టెన్ చేసిన రెండో డబుల్ సెంచరీ మాత్రమే. దీనికి ముందు కోహ్లీ 2016లో వెస్టిండీస్‌లోని నార్త్ సౌండ్‌లో డబుల్ సెంచరీ చేశాడు.
కెప్టెన్‌గా 3 ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ :
గిల్ కెప్టెన్‌గా మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను సాధించి సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. 1978లో వాంఖడేలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ కూడా కెప్టెన్‌గా మూడో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.
SENA దేశాలలో ఆసియా కెప్టెన్లలో ఫస్ట్ ఘనత :
గిల్ తన పేరు మీద మరో ప్రత్యేక రికార్డును క్రియేట్ చేశాడు. SENA దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్ అయ్యాడు. అంతకుముందు, ఆసియా కెప్టెన్లలో, తిలకరత్నే దిల్షాన్ 2011లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో 193 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.