Inspiring story: పిల్లలు బొమ్మలు ఈ రెండింటిని విడదీసి చూడలేం. అయితే ఎదిగే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడూ ఎదుర్కొనే సమస్య ఒకటుంది. అదే బొమ్మలు. బాబు లేదా పాపకు మంచి బొమ్మ కొందామంటే మార్కెట్లో నాసిరకమైనవి, ఏమాత్రం మానసిక సామర్థ్యాన్ని పెంచని బొమ్మలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని బొమ్మలు బాగున్నా వాటి ధర ఆకాశంలో ఉంటుంది. ఈ సమస్య ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎదుర్కొనే ఉంటారు.
కన్న కొడుకు ఆడుకునేందుకు మార్కెట్ లో మంచి బొమ్మ ఒక్కటీ లేదు. ఎదిగే పిల్లల్లో జీవన నైపుణ్యాలను వెలికి తీయాలన్న ఆలోచన ఏ బొమ్మల తయారీ సంస్థకూ రాదని. ఈ సమస్యలు ఓ పరిష్కారం చూపాలని భావించింది మీతా శర్మ. ఇక లాభం లేదనుకుని తనే ఆర్గానికి బొమ్మల తయారీ చేస్తోంది.
మీతా శర్మ కొంత కాలం విదేశాల్లో ఉంది. తర్వాత బెంగళూరుకు తిరిగొచ్చింది. తన కొడుకు ఆడుకునేందుకు మార్కెట్లో మంచి ఆట వస్తువులే లేవని అర్థమైంది మీతా శర్మకు. ఒకటీ అరా ఉన్నా అనారోగ్యకరమైనవే అని గుర్తించింది. ఆ లోటును తీర్చడానికి ‘షుమీ’ అనే పేరుతో పర్యావరణ హితమైన ఆట వస్తువుల తయారీకి సిద్ధపడింది మీతా.
అన్ని వయసుల చిన్నారులనూ ఆకర్షించేలా బొమ్మలు తయారు చేస్తోంది మీతా శర్మ. ఏ దశలోనూ రసాయనాలను ఉపయోగించే ప్రసక్తే లేదని అంటోంది మీతా. షుమీ బ్రాండ్ బొమ్మలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. సరికొత్తగా బొమ్మలను రూపొందించే క్రమంలో చిన్న పిల్లల సలహాలు, సూచనలు తీసుకుంటుంది మీతా శర్మ. వాళ్లతో కలిసి ఆడుతుందీ పాడుతుందీ.