Rocket raghava : రాకెట్ రాఘవకు బుల్లి తెరపై ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్న ఈయన… కమెడియన్ గా మంచి పేరనే సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈయన బుల్లితెర పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి రాఘవ ఒక్క ఎపిసోడ్ లో కూడా మిస్ అవ్వకుండా కనిపించాడు. మోస్ట్ సీనియర్ కంటెస్టెంట్ గా రాఘవ పేరు చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి రాఘవ స్కిట్లు. ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు. అందుకే చాలా మంది రాకెట్ రాఘవను, ఆయన చేసే స్కిట్లను ఇష్టపడుతుంటారు.

Rocket raghava
అయితే అలాంటి రాఘవ ప్రస్తుతం తన రూటు మార్చుకున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో రెచ్చిపోతూ.. రొమాంటిక్ స్కిట్లు చేస్తున్నాడు. తన టీంలో ఓ యంగ్ అమ్మాయిని తెచ్చిపెట్టుకొని ఆమెతో కలిసి షోలో అదరగొడుతున్నాడు. అదిరిపోయే డ్యాన్సులు వేస్తూ… అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. గత వారం లాగే ఈ వారం కూడా ఓ రొమాంటిక్ డ్యాన్స్ చేశాడు. చిరు పాటకు ఆ అమ్మాయితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు.
వర్షపు సెట్ లో వానజల్లు గిల్లుతుంటే సాంగ్ పై డ్యాన్స్ ను ఇరగదీశాడు. అలా నీళ్లలో తడుస్తూ… ఈ ఇద్దరూ చేసిన పర్ఫామెన్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇంద్రజ అయితే షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. మొత్తానికి రాఘవ కూడా రొమాంటిక్ ట్రాకులతో ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడేమో. మొత్తానికి ఈ వారం శ్రేది డ్రామా కంపెనీలు అయ్యగారే నెంబర్ వన్ అంటూ రచ్చ రచ్చ చేయబోతున్నారు.
Read Also :Anchor Anasuya: అనసూయకి పువ్వు ఇవ్వబోయి.. పుష్పం అయిన కమెడియన్.. పగలబడి నవ్విన జడ్జెస్?