Telugu NewsLatestRam pothineni : త్వరలోనే రామ్ లవ్ మ్యారేజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?

Ram pothineni : త్వరలోనే రామ్ లవ్ మ్యారేజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?

Ram pothineni : టాలీవుడ్ బ్యాచిలర్స్ లో ఒకరైన రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కెరియర్ లో మంచి విజయాలతో దూసుకుపోతున్న ఆయన… ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది. కొంత కాలం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని.. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అతి త్వరలోనే పెళ్లి పనులు ప్రారంభించేందుకు రామ్ సిద్ధమవుతున్నారని… కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Hero ram pothineni love marriage news
Hero ram pothineni love marriage news

అయితే ఆగస్టులో నిశ్చితార్థం, నవంబర్ లో పెళ్లి జరగొచ్చని తాజా సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందోయ తెలియాలంటే రామ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ నోరు తెరవాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఆయన.. ఆ తర్వాత నుంచి దూకుడు పెంచారు. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన నటించి ది వారియర్ త్వరలోనే విడుదల కాబోతుంది.

Advertisement

Read Also :  Samantha: సామ్ సాంగ్ సల్మాన్ ను ఇన్ స్పైర్ చేసిందట.. లవ్ సింబల్ తో రిప్లై!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు