...

Gold Price Today : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు (ఆదివారం) కూడా భారీగా బంగారం ధరలు తగ్గాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధర పతనం అవుతూ వస్తోంది. వారం రోజుల్లో ఒకరోజు మాత్రమే బంగారం పెరిగి.. మిగతా రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారు ధరలు డౌన్ ట్రెండ్ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. బంగారం వెండి ధరలు దిగువకు నమోదవుతున్నాయి. రోజు రోజుకి బంగారం ధరలు భారీ తగ్గుదలను నమోదు చేస్తున్నాయి.

Gold Price Today : Gold And Silver price Today in Telugu States on July 17, 2022
Gold Price Today : Gold And Silver price Today in Telugu States on July 17, 2022

ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్లు) ధర 330 తగ్గి రూ.50,400గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.300 తగ్గి రూ.46,200గా నమోదైంది. అలాగే, వెండి ధరలు పెరిగాయి. వెండి ధర రూ 300 పెరిగి.. కిలో వెండి రేటు రూ. 60,700గా కొనసాగుతుంది.

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో  నేడు బంగారం ధరలు.. ఎంతంటే?

జూలై 11వ తారీకు బంగారం ధర రూ. 46, 950గా ఉంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 46,200కి పడిపోయి రూ. 750 తగ్గినట్లు తెలుస్తుంది. 24 క్యారెట్ల బంగారం రూ. 51,210గా ఉంటే.. ప్రస్తుతం రూ.50,400గా కొనసాగుతుంది. పసిడి ధర కూడా రూ. 810 తగ్గిపోయింది.

విజయవాడ మార్కెట్ లో 24 క్యారెట్స్ బంగారం రూ. 50,4092గా ఉంది. 22 క్యారెట్స్ బంగారం ధర 300 తగ్గి రూ. 46,200 ఉంది. వెండి కిలో60,700గా ఉంది. ఏపీలోని ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకే రేటు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్లు) రూ.330 తగ్గి రూ.50,400గా ఉంది.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 300 తగ్గి రూ. 46,200తో కొనసాగుతోంది. కానీ, వెండి భారీగా పెరిగి కిలో రూ. 600 పెరిగి రూ 55,600కు చేరింది. మరోవైపు.. అంతర్జాతీయ బంగారం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం వెండి ధర కేజీ రూ. 54,986 వద్ద కొనసాగుతుంది. కనిష్ఠ స్థాయిలో బంగారం ధర 0.3 శాతం తగ్గి రూ. 50,090 వద్ద కనిష్ఠ స్థాయిలో పడిపోయింది.

Read Also : Gold prices today : ఏపీ, తెలంగాణల్లో భారీగా తగ్గిన వెండి ధరలు.. స్వల్పంగా బంగారం ధరలు?