Intinti Gruhalakshmi june 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దివ్య అంకిత కు ఫోన్ చేసి జరిగిందంతా వివరిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో అంకిత గాయత్రీ పై విరుచుకు పడుతుంది. ఎందుకు తులసి ఆంటీ ని అలా పదేపదే అపార్థం చేసుకుంటున్నావు. అయినా కూతురు అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత నీకు కూతురిపై ఎలాంటి హక్కు లేదు అని అనడంతో అప్పుడు గాయత్రి హక్కు కాదు అది నా బాధ్యత అని అనగా అప్పుడు అంకిత నీది అభిది వార్త గుణం అందుకే మీరిద్దరూ అన్ని విషయాల్లో ఒకటి గా ఉంటారు అని మండిపడుతుంది.
అప్పుడు నువ్వు లాస్య ఆంటీ మాయలోపడి ఆంటీ ని అవమానించావు అని అనగా అప్పుడు గాయత్రి నేను కాదు నువ్వే తులసి మాయలో ఉన్నావు అని అంటుంది. అప్పుడు అంకిత కోపంతో ఈసారి ఎవరు ఆపినా ఆగేది లేదు ఆస్తి నా పేరు మీద రాగానే మహర్షి మొత్తం తులసి ఆంటీకి రాసిస్తాను అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది అంకిత.
మరొకవైపు తులసి జరిగిన విషయం తెలుసుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో పరంధామయ్య వచ్చి ఓదారుస్తాడు. అప్పుడు తులసి తన పిల్లలు అంటే తనకు ప్రాణమని వాళ్లకు ఏదైనా జరిగితే తట్టుకోలేము అని బాధపడుతూ ఉంటుంది.
మరొకవైపు అభి లాస్య, గాయత్రీ లతో కలసి తులసి గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు లాస్య మేము చెప్పకపోయినా నువ్వే నిజం తెలుసుకున్నావు అవి అని అనగా అప్పుడు గాయత్రి తులసి మాయలో ఉన్న అంకిత ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో అని అంటుంది. అప్పుడు అభి తులసి పై కోపంతో రగిలి పోతూ ఉంటాడు.
అప్పుడు లాస్య,గాయత్రి తులసి మీద లేనిపోని మాటలు అన్నీ చెప్పి అభిని మరింత రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు గాయత్రి మాట్లాడుతూ అంకిత ఆస్తి మొత్తం అనే పేరు మీదకి రాగానే తులసి కి రాసి ఇస్తాను అని చెప్పింది అని గాయత్రీ అనడంతో అభి, లాస్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
వెంటనే లాస్య అభి పేరుమీద రాయించు అని సలహా ఇచ్చి లోలోపల సంతోష పడుతూ ఉంటుంది. ఇక అభి కూడా కోట్ల ఆస్తి వస్తుంది అని తెలియగానే సంతోష పడుతూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో అంకిత తండ్రి అంకిత పై ఆస్తి మొత్తం రాసి ఇస్తాడు.
అప్పుడు గాయత్రీ గట్టిగా అరుస్తూ ఎవరు చెబితే ఇలా చేసావు అని అనగా తులసి చేబితే చేశాను అని అనడంతో అభి నేరుగా తులసి దగ్గరికి వెళ్లి నువ్వు చేసిన మోసం జీవితంలో మర్చిపోలేను. ఇంకెప్పుడూ నేను మీ ఇంటి గడప కూడా తొక్కను నీ ముఖం కూడా చూడను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభి.
Read Also : Intinti Gruhalakshmi June 6 Episode : ఆస్తి కోసం మరి దారుణంగా మారిన నందు.. ఏకంగా తులసిపై పోలీస్ కేస్!
Tufan9 Telugu News And Updates Breaking News All over World