...

Karthika Deepam june 7 Today Episode : నా పెళ్ళి నా ఇష్టం అన్న నిరుపమ్..సత్య ఇంటికి వచ్చిన స్వప్న..?

Karthika Deepam june 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటు దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, శోభ ప్లాన్ ను తిప్పికొడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ వెళ్లి జ్వాలా కు సారీ చెబుతాడు. అప్పుడు జ్వాలా నాకు కోపం ఏమీ రాలేదు డాక్టర్ సాబ్ మీరు ఏమన్నా కూడా నేను పడతాను అని అంటుంది. అప్పుడు హిమ ను జ్వాలా మెచ్చుకుంది. ఆ తర్వాత స్వప్న, శోభ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడు స్వప్న ఏదో చేస్తాను అని అని చెప్పి నా పరువు తీసావు అంటూ శోభ పై విరుచుకు పడుతుంది.

Karthika Deepam june 7 Today Episode
Karthika Deepam june 7 Today Episode

ఆ తర్వాత స్వప్న,నిరుపమ్ తో మాట్లాడుతూ నువ్వు శోభ ను పెళ్లి చేసుకోక తప్పదు అని అనగా అప్పుడు నిరుపమ్ నా పెళ్ళి నా ఇష్టం.. కాపురం చేయాల్సిందేనని నేను మీకు ఈ విషయంలో హక్కు లేదు అన్నట్లుగా మాట్లాడటంతో స్వప్న షాక్ అవుతుంది. అప్పుడు సత్య కూడా మనం వాళ్ళ క్షేమం గురించి ఆలోచించే వాళ్ల పెళ్లి నిర్ణయం వాళ్లకే వదిలేద్దాం అని అంటాడు.

అప్పుడు నిరుపమ్ నాకు కాబోయే భార్య ని నువ్వు ఎలా చేస్తావు అది తప్పు కాదా అని అనడంతో అప్పుడు స్వప్న తాను చెప్పినట్టు వినకపోతే మీ అమ్మ బ్రతికి ఉండదు అని చెప్పి నిరుపమ్ కి వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. మరొకవైపు ప్రేమ్, హిమ దగ్గరికి వెళ్లి వీడియో చూడలేని బాధ పడుతూ ఉండగా హిమ తన ఫోన్ రిపేర్ కి ఇచ్చింది అని తెలిసి సంతోషంగా ఫీల్ అవుతాడు.

ఆ తర్వాత నిరుపమ్ సత్య ఇంటికి వెళ్లగా అక్కడికెళ్లిన జ్వాలా మీరు ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడగగా అప్పుడు నిరుపమ్ ప్రేమతో రెండు మాటలు చెప్పడంతో తన గురించి అన్నాడు అనుకున్న జ్వాల మరింత ప్రేమను పెంచుకుంటుంది. అప్పుడు సత్య అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని అంటూ ఉండగా ఇంతలోనే స్వప్న అక్కడికి వచ్చి పర్మినెంట్ గా అక్కడే ఉంటాను అన్నట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు దాని కంతటికీ కారణం శోభనే అని చెబుతుంది.

ఆ తర్వాత శోభ మీరు చేయలేని ఒక మంచి పని నేను చేశాను అని జ్వాలా,హిమతో అంటుంది. అప్పుడు శోభ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడగా ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న శోభ మా కుటుంబంలో ఒకటి కాబోతోంది అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam జూన్ 6 ఈరోజు ఎపిసోడ్ : శోభకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హిమ..జ్వాలా ఏం చేయనుంది..?