Karthika Deepam జూన్ 6 ఈరోజు ఎపిసోడ్ : శోభకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హిమ..జ్వాలా ఏం చేయనుంది..?

Karthika Deepam జూన్ 6 ఈరోజు ఎపిసోడ్
Karthika Deepam జూన్ 6 ఈరోజు ఎపిసోడ్

Karthika Deepam జూన్ 6 ఈరోజు ఎపిసోడ్ : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, జ్వాలా గురించి ఆలోచిస్తూ సౌర్య కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని అనుకుంటూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో శోభ పార్టీ కి వచ్చిన వారిని రిసీవ్ చేసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడకు నిరుపమ్, హిమ కూడా వస్తారు. అప్పుడు శోభ, జ్వాలా రాలేదా అని తిరుగుతూ కాస్త హడావిడి చేస్తోంది. అప్పుడు శోభ ప్రవర్తనను గమనించిన హిమ ఏదైనా కుట్ర చేయబోతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement
Karthika Deepam జూన్ 6 ఈరోజు ఎపిసోడ్
Karthika Deepam జూన్ 6 ఈరోజు ఎపిసోడ్

ఆ తర్వాత శోభ పార్టీ లో మాట్లాడుతూ స్వప్న ను గొప్పగా పొగుడుతుంది. ఇక ఆ పార్టీ లో ఇంద్రుడు, చంద్రమ్మ డ్రింక్స్ సర్వే చేస్తూ ఉంటారు. ఇక జ్వాలను చూసిన స్వప్న, ఎందుకు ఆటో వాళ్ళని పిలిచావు అంటూ శోభ పై చిరాకు పడుతుంది. అప్పుడు శోభ నేనేదో మాస్టర్ ప్లాన్ వేశాను అన్నట్టుగా స్వప్న వైపు చూసి కన్ను కొడుతుంది.

ఒక పార్టీలో కరెంటు వచ్చి పోగా, ఈ లోపలే శోభ నా నెక్లేస్ పోయింది అంటూ పెద్ద పెద్ద గా అరుస్తుంది. అప్పుడు నిరుపమ్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. అప్పుడు పోలీసులు వచ్చి ఇంద్రుడు జేబులో చెక్ చేయగా నెక్లెస్ దొరుకుతుంది. అప్పుడు ఇంద్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.

Advertisement

అప్పుడు స్వప్న వీళ్లంతా దొంగల బ్యాచ్ ఒకసారి కావాలనే నా కారును స్పాయిల్ చేశారు అని పోలీసులకు చెప్పడంతో అప్పుడు జ్వాలా మా పిన్ని బాబాయ్ లు అలాంటి వాళ్ళు కాదు అలా చేయరు అని సర్ది చెబుతూ ఉండగా ఇంతలో నిరుపమ్ వాళ్లను చూసి అసహ్యించుకుంటారు.

ఇంతలో హిమ కావాలని మెయిన్ ఆఫ్ చేసిన వ్యక్తిని సీసీ కెమెరా ద్వారా పసిగడుతుంది. ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి లాగి ఒకటి చంప మీద గట్టిగా కొడుతుంది. ఇక ఎవరు ఇదంతా కావాలనే ప్లాన్ చేశారు అనడంతో శోభ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తిని నేనే అని మెయిన్ ఆఫ్ చేశాను అని పోలీసుల ముందు నిజం ఒప్పుకుంటాడు.

Advertisement

ఇక ఇదంతా ఎవరు చేసారో వాళ్ళు ఇంద్రుడు ఫ్యామిలీకి సారీ చెప్పాలి అని హిమ కోరుతూ ఆ పని శోభనే చేసింది అని పసిగట్టిన హిమ శోభ దగ్గరికి వెళ్లి చెవిలో.. నేను తలుచుకుంటే నిరూపమ్ బావ దగ్గర క్షణాల్లో నీ పరువు తీయగలను అని అంటుంది. కాబట్టి వెళ్లి ఇంద్రుడు దంపతులకు సారీ చెప్పు అని అంటుంది. శోభ ఆ వ్యక్తిని చెంపమీద కొట్టి ఇంద్రుడు ఫ్యామిలీ కు క్షమాపణలు చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also :  Karthika Deepam june 6 Today Episode : కార్తీకదీపం సీరియల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న వంటలక్క… పూర్వవైభవంలోకి కార్తీకదీపం!

Advertisement