Intinti Gruhalakshmi: నందు పై విరుచుకుపడ్డ అనసూయ.. బాధతో కుమిలిపోతున్న తులసి…?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ బాగానే దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆఫీసుకు బయలుదేరిన నందు, లాస్య ని చూసిన అనసూయ మంచిగా తిను నాన్న, ఆరోగ్యం జాగ్రత్త నాన్నా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు నందు ఏమైంది అమ్మ అలా మాట్లాడుతున్నావు అని అడగగా.. ప్రేమ్, శృతి లు ఇంటి నుంచి వెళ్లిపోయి నందుకు మీరు కొంచెం కూడా బాధ లేదా రా.. నీకు చీమ కుట్టినట్టైనా లేదా అంటూ కోప్పడుతుంది.

Advertisement

అప్పుడు లాస్య మధ్యలో జోక్యం చేసుకోవాలి నువ్వు నోరు మూసుకో అని తిడుతుంది అనసూయ. అప్పుడు నందు నాకు సరైన సంపాదన లేదని తులసి అంటుంది అని గట్టిగా అరవ గా, అప్పుడు లాస్య మాట్లాడుతూ నీకు ఇంకా నందు మీద ఆశ చావలేదా అని అంటుంది. అప్పుడు తులసి ఏం నీకు భయం వేస్తున్నా అని అంటుంది.

మరొకవైపు అంకిత, అభి లు ప్రేమ్, శృతి ల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. రాములమ్మ, ప్రేమ్, శృతి ని తనకు తెలిసిన వాళ్ల ఇంటి దగ్గరికి పిలుచుకొని వెళ్ళి ఒక అద్దె ఇంటిని ఇప్పిస్తుంది. ఆ ఇంటిలో రెండు మూడు వేలు ఇచ్చే లాగా ఇంటి ఓనర్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది రాములమ్మ.

మరొకవైపు తులసితో అంకిత మాట్లాడుతూ ప్రేమ్ ను బయటికి పంపించినందుకు అందరూ చాలా బాధ పడుతున్నారు. దయచేసి ప్రేమ్ ని,శృతి ని ఇంటికి తీసుకు రండి ఆంటీ అని అంకిత చెప్పగా తులసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మరొక వైపు దివ్య ప్రేమ్, శృతి ల కోసం అన్నం తినకుండా అలాగే ఉంటుంది.

Advertisement

అప్పుడు తులసి కొంచెం తిను దివ్య అనే బతిమాలుతూ ఉండగా ప్రేమ్ అన్నయ్య ఇంటికి వచ్చే వరకు నేను అన్నం తినను అని గట్టిగా కసురుకుంటుంది దివ్య. అన్నం తినక పోయేసరికి దివ్య సృహ తప్పి పడిపోతుంది. ఇక వెంటనే ఇంట్లో అందరూ దివ్య దగ్గరికి చేరుకొని దివ్య ని తినమని బ్రతిమలాడుతారు. అప్పుడు దివ్య అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపొండి అంటూ అందరి పై చిరాకు పడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel