Intinti Gruhalakshmi June 6 Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ జూన్ 6వ తేదీ ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఎంతో రసవత్తరంగా మారనుంది.ఈ క్రమంలోనే సోమవారం నాటి ఎపిసోడ్ ఏంటో ఇక్కడ చూద్దాం..అంకిత తులసికి ఫోన్ చేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళమని ఆర్డర్ వేస్తే నేను వచ్చాను ఇప్పుడు మీరు నన్ను ఏకంగా ఇంటికి రావడానికి వీల్లేదంటూ మాట్లాడుతున్నారు మీ మాటకు విలువ ఇచ్చినందుకు మీరు నాకు ఇచ్చేది ఇదేనా ఆంటీ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక అంకిత ఫోన్ పెట్టేయగానే వదినను నువ్వు ఏమీ అనొద్దు మామ్ అని దివ్య తులసితో మాట్లాడుతుంది. అయితే మనసులో తులసి నువ్వు ఇక్కడికి వస్తే నీ కాపురం చెడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి నీ జీవితం నాలా కాకూడదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని బాధపడుతుంది.
ఇక దారిలో వెళ్తున్న తులసినీ ఆపి లాస్య మాట్లాడుతూ క్రమక్రమంగా మీ కుటుంబ సభ్యులందరినీ నుంచి దూరం చేస్తాను. అనుకుంటే ఇప్పుడే నా పెద్దకొడుకు కోడలిని నా ఇంటికి రప్పించగలను అంటూ తులసి మాట్లాడుతుంది. ముందు నువ్వు మీ ఆయన మీ వంకర బుద్ధులు మార్చుకోండి. అంకితకు కోట్ల ఆస్తి కలిసొస్తుందని తన బర్తడే కు రెండు లక్షలు ఖర్చు చేసి పార్టీ చేశారు. పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకొని మీ ఆయన అభిని రాసుకుని పూసుకొని తిరుగుతున్నాడు. బర్తడే రోజు కేకు ముక్క కూడా తినిపించని మీ ఆయన ఏకంగా కేక్ ఆర్డర్ చేశారు. ప్రతిఫలం ఆశించకుండా నే ఇవన్నీ చేశారా అంటూ అసలు విషయం గురించి మాట్లాడుతుంది.
తులసి మాటలు విన్న లాస్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఇన్ని రోజులు తెలియకుండా జాగ్రత్త పడ్డాం ఇక ఈ విషయం మీకు తెలిసిన తర్వాత దర్జాగా మా పని మేం చేసుకుంటాము అంటూ మాట్లాడటంతో తులసి షాక్ అవుతుంది. లాస్య మాట్లాడుతూ నేను అనుకుంటే ఒక్క క్షణంలో నిన్ను నీ సామ్రాజ్యాన్ని కూల్చి వేయగలను. నువ్వు చూస్తుండగానే నీ ఇంట్లోకి వచ్చా, నీ భర్త చేత తాళి కట్టించుకున్నా,అలాంటిది మీ పిల్లలను విడదీయలేనా అని మాట్లాడుతుంది. తులసి మాట్లాడుతూ ఏ తల్లి కూడా తన పిల్లలకు ఆపద వస్తుందంటే చూస్తూ ఊరుకోదు అప్పుడంటే నా భర్త తప్పు ఉంది కనుక గమ్మున ఉన్న నా పిల్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఇక పుట్టినరోజు పార్టీ లో తన తల్లి తనని ఒక్క మాట కూడా పలకరించలేదని ప్రేమ్ బాధ పడతాడు. ఇక ప్రేమ్ మాటలకు శృతి నచ్చచెప్పి అతనిని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా అభితో మాట్లాడాలని తులసీ తనని ఒక కేఫ్ కి రమ్మని చెబుతుంది. అంతలోపే గాయత్రి ఫోన్ చేయడంతో తను బిజీగా ఉన్న తర్వాత కాల్ చేస్తాను అని చెబుతాడు. ఇక పోతే లాస్య నందు తులసి ఇంటికి వెళ్లి తనతో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకుంటారు.ఇంట్లో ప్రతి ఒక్కరినీ గుప్పెట్లో పెట్టుకొని నా పిల్లలను నాకు దూరం చేద్దాం అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు.
నన్ను నా పిల్లలను దూరం చేయాలన్న, మా మధ్య ఎవరు అడ్డు వచ్చిన ఊరుకునేది లేదు. నా పిల్లలను నాకు దూరం చేస్తున్నావని నీ పై కేసు కూడా పెట్టడానికి వెనుకాడను అని నందు అంటారు.దీంతో షాక్ అయిన తులసి మీరేం చేస్తారో చేయండి నేను చేయాల్సింది చేస్తాను అంటూ నందుకు గట్టి వార్నింగ్ ఇస్తుంది. అయితే తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.
Read Also : Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World