Devatha july 20 today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య,రాధ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఆదిత్య, రాధ ఇద్దరు దేవికి ఎలా అయిన నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య అసలు విషయాన్ని దేవికీ చెబితే ఏమనుకుంటుందో అని అనగా లేదు ఎలా అయిన ఈ రోజు నిజం చెప్పాలి అని రాధ తెగ సంతోషపడుతూ ఆరాట పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత దేవిని పిలుచుకుని వస్తాను అని రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మాధవ, దగ్గరికి దేవి వెళ్ళగా మాధవ ఏడుస్తూ ఉండడంతో ఏమైంది నాయన ఎందుకు ఏడుస్తున్నావు అని దేవి అడగగా నన్ను క్షమించు తల్లి ఎన్ని రోజులు నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను అని అనగా వెంటనే దేవి మాధవ ఏమీ అర్థం కాకుండా అర్థం కాక మౌనంగా ఉంటుంది. అప్పుడు మాధవ దొంగ ఏడుపులు ఏడుస్తూ నేను మీ కన్న తండ్రిని కాదు సొంతం నాన్నని కాదు అనడంతో దేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Devatha : దేవత సీరియల్ జూలై 20 ఎపిసోడ్ ఎమోషనల్ అవుతున్న రాధ…
తర్వాత ఆదిత్య గురించి ఒకసారి వాడు మీ అమ్మను తరచూ కొట్టేవాడు అంటూ లేనిపోని అబద్ధాలు అని నోరు పోసి దేవి మనసును చెడగొడతాడు. ఇంతలోనే అక్కడికి రాధ రావడంతో దేవి ఏడుస్తూ వెళ్లి రాతను హత్తుకుని మాధవ మన సొంత నాయన కాదంట కదా అమ్మ అనడంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత నాయన నిన్ను రోజు కొట్టేవాడు అంట కదా అమ్మ అటువంటి కసాయి నా కొడుకు నేను పుట్టానా అనడంతో రాధ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది.
మరొకవైపు రాధ ఎంతసేపటికి రాకపోయేసరికి ఆదిత్య ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో దేవుడమ్మ, ఆదిత్య కుదేవి ఫోన్ చేయడంతో ఆదిత్య సంతోషంతో దేవి గెలిచింది అని చెబుతాడు. ఆ మాటకు దేవుడమ్మ సంతోషపడుతూ ఇంట్లో అందరినీ పిలిచి అసలు విషయం చెప్పడంతో ఇంట్లో అందరూ సంతోషపడుతూ ఉంటారు.
అప్పుడు దేవుడమ్మ దేవికి ఇష్టమైనది ఏదైనా ఒక స్వీట్ చేయాలి అని అనుకుంటుంది. ఇంతలోనే రాధ ఆదిత్య దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తుంది. కానీ అసలు విషయం తెలియని ఆదిత్య దేవికి చెప్పావా ఈరోజు మా అమ్మకు దేవిని మనవరాలని అని పరిచయం చేస్తాను అని అంటూ ఉండగా రాధ మరింత ఎమోషనల్ అవుతుంది. ఆదిత్య ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా రాధ ఏం చెప్పకుండా అక్కడి నుంచి దేవిని తీసుకొని వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ఆదిత్య కార్లో వెళ్తూ రాధ ఎందుకు అలా చేసింది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు మాధవ తన సక్సెస్ అయినందుకు సంతోషపడుతూ ఉంటాడు. ఆ తర్వాత దేవి రాధా ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అప్పుడు దేవికి దాహంగా ఉంది అనడంతో వెంటనే రాధ షాప్ లో ఒక సౌడ ని తీసి తాగిపిస్తుంది. ఆ తర్వాత దేవి మాట్లాడుతున్న మాటలకు రాధ సమాధానం చెప్పలేక కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు రాధ ఈ విషయం గురించి ఇకమర్చిపో అని చెప్పి దేవుని ఎక్కడినుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది.
Read Also : Devatha july 19 Today Episode : మాధవ మాటలకు కోప్పడిన రాధ.. ఆదిత్య గురించి గొప్పగా పొగిడిన దేవి..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World