Devatha july 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య,రుక్మిణి, దేవి ముగ్గురు కలిసి చెస్ కాంపిటీషన్ కు వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో చెస్ కాంపిటీషన్ మొదలవుతుంది. ఇక చెస్ కాంపిటీషన్లో పాల్గొన్న దేవి మొదటి రెండు రౌండ్లు కూడా గెలుస్తుంది. అది చూసి పక్కనే నిలబడిన రాధ, ఆదిత్య సంతోష పడుతూ ఉంటారు. కానీ మాధవ మాత్రం రాధ, ఆదిత్యలను చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య దేవి ఆటను చూసి కరెక్ట్ గా ఆడుతుంది అని సంతోష పడుతూ ఉంటాడు.

మరొకవైపు సత్య ఆదిత్య అన్న మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే కమల అక్కడికి వచ్చి సత్య నీతో కొంచెం మాట్లాడాలి అని అనగా చెప్పు అక్క అనడంతో దేవి మన ఇంటికి వచ్చినప్పుడు పటేలా ముఖంలో ఆనందం చూశావా దేవి వచ్చిన ప్రతిసారి కూడా పటేలా చాలా ఆనందంగా కనిపిస్తాడు.
Devatha : జూలై 19 ఎపిసోడ్ : ఆదిత్య గురించి గొప్పగా పొగిడిన దేవి..
పిల్లల మీద ప్రేమ ఉంటే అందరినీ ఒకేలా చూడాలి కానీ పటేలా మాత్రం దేవిని తన సొంత బిడ్డలా చూస్తాడు అని అనటంతో సత్య అసలు విషయం చెప్పలేక బాధపడుతూ ఉంటుంది. పటేలా దేవిని ప్రేమగా చూడటం తప్పు అనడం లేదు కానీ పిల్లలకోసం ఎంతలా ఆరాటపడుతున్నాడు చూస్తే బాధ అవుతోంది అని చెప్పి కమలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు సత్య, రుక్మిణి అక్క కూతురు కాబట్టి ఆదిత్య దేవిని అంతగా ప్రేమిస్తున్నాడు అది మీకు ఎలా చెప్పాలి అక్క అని బాధపడుతూ ఉంటుంది. చెస్ కాంపిటీషన్ లో మాధవ, రాధతో మాట్లాడుతూ దేవిని నన్ను దూరం చేయడానికి ఏమైనా కొత్తగా ప్లాన్లు వేసారా చెప్పండి నా ప్లాన్ లో నేను ఉండాలి కదా అని అనగా ఆ మాటకు రాధ కోపంతో రగిలిపోతుంది.
మరొకవైపు చెస్ కాంపిటీషన్ లో మూడు రౌండ్ లో దేవి గెలవగా నాలుగవ రౌండ్ లో కూడా దేవి గెలిచి విన్నర్ గా నిలవడంతో రాధ,ఆదిత్యలు సంతోషంలో మునిగితేలుతూ ఉంటారు. అది చూసిన మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత గెలిచిన దేవి వెళ్లి ఆదిత్యను హత్తుకోవడంతో మాధవ అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు.
దేవిని చూసి ఆదిత్య,రాధ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు దేవి ఆదిత్య చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంటుంది. ఆ తర్వాత ఆదిత్య గురించి ఆదిత్య గొప్పతనం గురించి అందరికీ గొప్పగా చెప్పడంతో ఆదిత్య సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు మాధవ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రాధ, ఆదిత్యలు పక్కకు వెళ్లి మాట్లాడుతూ దేవికి ఎలా అయినా అసలు విషయాలు చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఇచ్చే మాత్రం దేవి ఆ మాట చెబితే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు.
Read Also : Devatha july 18 Today Episode : దేవి మాటలకు సంతోషపడుతున్న రాధ, ఆదిత్య.. కోపంతో రగిలిపోతున్న మాధవ..?