Guppedantha Manasu Dec 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసు రిషికి అబద్ధం చెప్పినందుకు బాధపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్లో సుమిత్ర, వసుధార కోసం భోజనం తీసుకుని వస్తుంది. రామ్మా వసుధార వచ్చి భోజనం చేయి అని అనగా నాకొద్దు అమ్మా నాకు ఆకలిగా లేదు అనడంతో మీ నాన్న గురించి తెలిసిందే కదా చిన్న దానికి పెద్ద దానికి కోప్పడుతూ ఉంటారు. నా బుజ్జి తల్లి కదా నా బంగారు తల్లి కదా తినమ్మా అని వసుధారకి ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు వసుధార ఎందుకమ్మా నాపై నాన్నకు అంత కోపం అనడంతో చాలా రోజుల తర్వాత వచ్చావు కదా వసుధార ఆ కోపం ఉంటుంది లే అయినా ఎంతైనా ఆయన మీ నాన్ననే కదా.

నీకు ఒక విషయం తెలుసా మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అనడంతో నిజమా అమ్మ అని అడుగుతుంది వసుధార. నువ్వు చిన్నప్పుడు కనిపించకపోతే టెన్షన్ పడిపోయేవారు ఎక్కడికి వెళ్ళినా కానీ తనతో పాటు తీసుకెళ్లేవాడు అని అంటుంది సుమిత్ర. అప్పుడు వసుధార బాధ తగ్గించడానికి పాత జ్ఞాపకాలు చెబుతూ గోరుముద్దలు తినిపిస్తూ ఉండగా ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి సుమిత్ర చేతిలో ఉన్న భోజనం ఫేటు లాక్కుంటాడు. ఏంటండీ కూతురికి భోజనం తినిపిస్తుంటే అలా తీసుకున్నారు అనడంతో అది నా కూతురు కాదు నా పాలిట శత్రువు అని అంటాడు చక్రపాణి.
అప్పుడు వసుధార కి రిషి ఫోన్ చేస్తూ ఉంటాడు. చక్రపాణి వసుధారని నానా మాటలు అంటూ తిడుతూ ఉండగా రిషి పదేపదే ఫోన్ చేయడంతో చూసావా సుమిత్ర అది ఇలా ఇంటికి వచ్చిందో లేదో దానికి పదేపదే ఫోన్లు వస్తున్నాయి ఏనాడైనా నీకు అది ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడించిందా అని అంటాడు. అదేదో పని మీద వచ్చింది ఆ పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు నేను మాత్రమే మిగులుతాము దాన్ని నమ్మకు అని అంటాడు. అప్పుడు పదేపదే రిషి మళ్ళీ ఫోన్ చేస్తుండడంతో చక్రపాణి ఎవడు వీడు పదేపదే ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ ని నేలకేజీ విసిరి కొట్టడంతో ఫోన్ పగిలిపోతుంది.
దాంతో వసుధార ఫోన్ చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు వసుధార కి జగతి ఫోన్ చేస్తుండగా స్విచ్ ఆఫ్ రావడంతో జగతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్రా ఏం కాదు జగతి ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. మరొకవైపు రిషి వసుధార ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఏమయింది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే దేవయాని ఫోన్ చేయడంతో చెప్పు వసుధార అని అనగా మీరు మీ పెద్దమ్మని రిషి అని అంటుంది దేవయాని. తిన్నావా నాన్న వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళావా అనడంతో లేదు పెద్దమ్మ అనగా వెంటనే దేవయాని ఫోన్ కట్ చేసి రాజీవ్ కి ఫోన్ చేసి నేను చెప్పింది గుర్తుంది కదా చెప్పింది చెప్పినట్టు చేయాలి అని అంటుంది.
రిషి వసుధారలు కలుస్తారా ఎలా కలుస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. మరొకవైపు రిషి వసుధార చదువుకున్న కాలేజీకి వెళ్లి సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార తన ఫోన్ చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర, చక్రపానికి నచ్చజెప్పి ప్రయత్నం చేయగా దాని మీద నాకు కోపం తగ్గదు అని కోపంగా మాట్లాడుతాడు చక్రపాణి. ఇంతలోనే వసుధార బయటికి రావడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు చక్రపాణి. మరొకవైపు రిషి వసుధార ఫోన్ చేయలేదు స్విచాఫ్ వస్తుంది అంటే అక్కడ ఏదో జరిగింది తన ఇంటికి వెళ్ళాలి అని ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడు చక్రపాణి అది ఇంటికి వచ్చి ఉంది కదా నా కాళ్ళపై పడి నన్ను క్షమించండి తప్పయిపోయింది అని అడుగుతోందా దానికి అహంకారం ఎక్కువ అని అంటాడు.
అప్పుడు వసుధార గట్టిగా మాట్లాడడంతో చూసావా కన్నా తండ్రి మీద ఎలా అరుస్తుందో అని అంటారు చక్రపాణి. పరువు పరువు అని మాట్లాడడంతో మిమ్మల్ని ఎవరు ఏమంటారు నా ముందుకు తీసుకురండి వాళ్లకు నేను సమాధానం చెబుతాను అని అంటుంది వసుధార. అప్పుడు చక్రపాణి మళ్లీ వసుధార మీద సీరియస్ అవుతాడు.