Ragi Health benefits : మన పూర్వీకులు రాగులను కంపల్సరీగా తమ ఆహారంలో భాగం చేసుకునేవారని పెద్దలు చెప్తుంటారు. అయితే, కాలక్రమంలో జీవనశైలి బాగా మారిపోయింది. దాంతో ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అలా ఇప్పుడు బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకునే పరిస్థితులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనాలు తొందరగా అనారోగ్యాల బారినపడుతున్నారు. కాగా, రాగులు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు, పెద్దలు చెప్తున్నారు.

మానవశరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ధాన్యాలు అయిన రాగులను ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. రాగులను జావా చేసుకుని తాగే వారిని బోలెడు మంది మనం చూడొచ్చు కూడా. వేసవి కాలంలో రాగి జావా విరివిగా లభిస్తుంటుంది. ఇది తీసుకోవడం వలన డీ హైడ్రేషన్ సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి. ఇందులో ఉండే యాసిడ్స్ అన్ని కూడా హెల్త్‌కు చాలా మంచివి.
ముఖ్యంగా ఇందులో ఉండే అమినో యాసిడ్ ఆకలిని తగ్గించడంతో పాటు వెయిట్ లాస్ అయ్యేందుకు దోహదం చేస్తుంది. ఇకపోతే ఇందులో ఉండే ఫైబర్ హెల్త్‌కు చాలా అవసరమైంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్‌లో బలవర్ధకమైన ఆహార పదార్థాలు దొరకడం లేదు. అంతా కల్తీమయం అవుతున్న నేపథ్యంలో రాగులను తీసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముకలు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

రాగులను క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వడం ద్వారా అందులో ఉండే క్యాల్షియం పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. రాగులు ముఖ్యంగా మహిళలు తీసుకుంటే చాలా ఉపయోగకరమట. అది వారికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ అన్నిటినీ అందిస్తుంది. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకంటే ఎప్పుడూ అందంగా ఉండొచ్చు. ఇవి మీ వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడతాయట. స్కిన్‌ను మెరిసేలా చేయడంతో పాటు మృదువుగా ఉంచేందుకు ఇవి సాయం చేస్తాయి. ఫలితంగా మీరు యవ్వనంగా కనిపించొచ్చు.
Read Also : Health Tips : వేసవి కాలంలో రాగి అంబలితో కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!