...

Guppedantha Manasu Dec 26 Today Episode : వసుధారపై సీరియస్ అయిన చక్రపాణి.. వసు గురించి టెన్షన్ పడుతున్న రిషి?

Guppedantha Manasu Dec 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధర రావడంతో సుమిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార చక్రపాణి దగ్గరికి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్లగా పక్కకు వెళ్తాడు. నన్ను దీవించండి నాన్న నేను యూనివర్సిటీ టాపర్ అయ్యాను అనడంతో సుమిత్ర సంతోషపడుతూ ఉండగా ఎందుకు వచ్చావు అని అంటాడుచక్రపాణి. ఇప్పుడు సుమిత్ర ఏంటండీ అలా మాట్లాడుతున్నారు అమ్మాయి రాకరాక ఇంటికి వస్తే అలాగేనా మాట్లాడేది అనడంతో సుమిత్ర నువ్వు మౌనంగా ఉండు నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసు కదా అని అంటాడు.

Guppedantha Manasu Dec 26 Today Episode
Guppedantha Manasu Dec 26 Today Episode

అప్పుడు వసుధార నాన్న అని పిలవడంతో నోరు ముయ్యి అలా పిలవడానికి నీకు సిగ్గుగా లేదా నిన్ను కన్న పాపానికి ప్రతిరోజు నేను వీధిలో తల దించుకొని నడుస్తున్నాను పలానా చక్రపాణి కూతురు పెళ్లి పీటల నుంచి లేచిపోయింది అని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ప్రాణాలు పోతున్నాయి అని అంటాడు. నాన్న నేను గొప్ప చదువులు చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నాను అని వసుధార అనడంతో ఎవరికి కావాలి నీ గొప్ప అని అంటాడు చక్రపాణి. ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అప్పుడే మీ నాన్న చచ్చిపోయాడు నువ్వు కూడా ఎక్కడో ఒకచోటి చచ్చిపోయావని అనుకోని బతుకుతున్నాను మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటాడు. ఎందుకు నాన్న నామీద మీకు ఇంత కోపం అని వసుధార అనడంతో చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు నన్ను కోపం అంటున్నావా అని అంటాడు.

ఇప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు చక్రపాణి. అప్పుడు వసుధార వెళ్లి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడడంతో చక్రపాణి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సుమిత్ర వసుధార ఇద్దరు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. మరొకవైపు ఒక హోటల్ కి వెళ్లిన రిషి రూమ్ తీసుకుంటూ నేను మీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను అని మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత వసుధార మిత్ర ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. అమ్మ అక్కడికి వెళ్లినా కానీ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నాను అనగా ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా వసు అనడంతో ఫోన్ చేసినప్పుడు నాన్నకు తెలిస్తే మళ్లీ కోప్పడతారని నేను చేయలేదు అని అంటుంది.

అప్పుడు వసుధార నేను ఏ లక్ష్యంతో అయితే ఇల్లు విడిచి వెళ్లాను అది గెలిచానో యూనివర్సిటీ టాపర్గా నిలిచాను అనడంతో సుమిత్ర సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు కనిపించలేదు అని అడగగా తలా ఒక దిక్కు వెళ్లిపోయారు అందరం విడిపోయాము అని అంటుంది సుమిత్ర. అప్పుడు వసుధార నేను వచ్చాను కదా అమ్మ అందరినీ ఒకటి చేస్తాను అనడంతో సుమిత్ర సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార యూనివర్సిటీ టాపర్ అయినందుకు కప్పు ఇచ్చారు అని చూపిస్తూ ఉండగా ఇంతలోనే చక్రపాణి అక్కడికి వచ్చి దానిని విసిరి కొడతాడు.

ఏం గొప్ప చేశావని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావు వీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటే ముఖం మీద ఉమ్మేస్తున్నారు అని అనడంతో వసుదర షాక్ అవుతుంది. ఇప్పుడు రిషి వసుధార కి ఫోన్ చేస్తూ ఉంటాడు. వసుధరా గొడవలో పడి ఫోన్ వైపు చూడకుండా ఉంటుంది. నువ్వు గెలిచిన గెలుపు పోయిన పరువు తీసుకువస్తుందా బయటికి వెళ్తే తల ఎత్తుకోలేకపోతున్నాను అని అంటాడు చక్రపాణి. నేను ఇన్ని మాటలు అంటున్నా నువ్వు సిగ్గు లేకుండా అలాగే నిలబడ్డావు ఈపాటికి వేరే వాళ్ళైతే విషయం తాగితే వాళ్ళు అని అంటాడు చక్రపాణి.

అప్పుడు సుమిత్ర వెంటనే దాని ఇంట్లో నుంచి వెళ్లిపోమను అనడంతో వసుధార షాక్ అవుతుంది. ఒకవైపు వసుధార కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. పొగరు ఏం చేస్తోంది ఫోన్ కోసం ఎదురు చూస్తాను అని చెప్పాను కదా అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోని వసుధార అక్కడికి వచ్చినట్టు ఊహించుకుంటాడు రిషి. మరొకవైపు వసుధార జరిగిన విషయాలు తెలుసుకుని కుమిలిపోతూ ఉండగా ఎంతలో రిషి ఫోన్ చేయడంతో ఏమీ తెలియనట్టుగా కళ్ళు తుడుచుకుని మాట్లాడుతూ ఉంటుంది.

ఏమయింది వసుధర వెళ్లి ఫోన్ చేస్తాను అన్నావు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఆనంతో అదేమీ లేదు సార్ అని అంటుంది. అక్కడ అంతా ఓకే నా మీ వాళ్ళు ఏమీ అనలేదు కదా అనగా ఏమి లేదు సార్ అని అబద్ధాలు చెబుతుంది వసు. అప్పుడు రిషి వసుధారపై అనుమానంతో మీ వాయిస్ లో ఎందుకో బాధ అనిపిస్తుంది నా మనసుకు కూడా బాధగా ఉంది వసుధార నిజం చెప్పు అక్కడ ఏం జరిగింది అని అడగగా ఏమీ లేదు సార్ చాలా గ్యాప్ తర్వాత వచ్చాను కదా కొంచెం ఎమోషనల్ అయ్యాను అని అబద్ధాలు చెబుతుంది వసుధార. అప్పుడు సరే అని అంటాడు రిషి. ఇప్పుడు వసుధార ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మ పిలుస్తున్నట్టుగా అబద్ధం చెప్పి రిషి తో ఫోన్ మాట్లాడకుండా కట్ చేస్తుంది. అప్పుడు ఫోన్ కట్ చేసిన తర్వాత నన్ను క్షమించండి రిషి సార్ మీతో అబద్ధాలు చెప్పాను. అని ఏడుస్తూ ఉంటుంది వసుధార.

Read Also : Guppedantha Manasu: దేవయానికి బుద్ధి చెప్పిన జగతి.. వసుధారను చూసి కోపంతో రగిలిపోతున్న తండ్రి?