Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu May 26 Today Episode: వసుకి ఐ లవ్ యు చెప్పిన రిషి..ప్రేమతో హత్తుకున్న వసు..?

Guppedantha Manasu May 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్తాడు రిషి. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు కోసం ఐ లవ్ యు అనే గిఫ్ట్ లో తన ఫోటో వసుధార ఫోటో ఉండేవిధంగా ఒకటి గిఫ్ట్ తీసుకుని ... Read more

By Ramesh Babu

Published on: May 26, 2022 8:29 AM

Updated on: May 26, 2022 9:45 AM

Guppedantha Manasu May 26 Today Episode

---Advertisement---

Guppedantha Manasu May 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్తాడు రిషి.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు కోసం ఐ లవ్ యు అనే గిఫ్ట్ లో తన ఫోటో వసుధార ఫోటో ఉండేవిధంగా ఒకటి గిఫ్ట్ తీసుకుని వసు దగ్గరకు ఆనందంగా బయలుదేరుతాడు. ఇంతలో సాక్షి, రిషి కి ఫోన్ చేయగా అప్పుడు రిషి ఫోన్ కట్ చేసి డోంట్ డిస్ట్రబ్ మీ అంటూ మెసేజ్ చేస్తాడు.

Guppedantha Manasu May 26 Today Episode
Guppedantha Manasu May 26 Today Episode

కానీ సాక్షి మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేదే లేదు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు వసు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి రిషి కి ఫోన్ చేసి ఎగ్జామ్ సూపర్ సూపర్ గా రాశాను సార్ అది అనగా, అప్పుడు రిషి నువ్వు తప్పకుండా ర్యాంకు సంపాదిస్తావు అని నమ్మకంతోనే ముందుగా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వస్తున్నాను నువ్వు తప్పకుండా తీసుకోవాలి అని అనగా తప్పకుండా తీసుకుంటాను సార్ అని అంటుంది వసు.

మరొక వైపు దేవయాని ఇంట్లో పాటలు వింటూ ఆనందంగా ఉండగా అప్పుడు కిచెన్ లో ధరణి, జగతి ఇద్దరూ దేవయాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ధరణి దేవయాని అత్తయ్య ఏదో దుర్మార్గపు ఆలోచన చేసే ఉంటుంది అందుకే ఆనందంగా ఉంటుంది అని అంటుంది.

మరొకవైపు రిషి, వసు కోసం ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేయగా వసు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ తర్వాత వసు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వస్తాడు. అప్పుడు వసు రిషి ఇచ్చిన పెన్న రిటర్న్ ఇస్తూ కొంచెం ఫీల్ గా మాట్లాడుతుంది. కానీ రిషి కి మాత్రం ఏమైందో అర్థం కాక అలాగే మాట్లాడుతూ ఉంటాడు.

ఆ తర్వాత వారిద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉండగా ఈ మధ్యకాలంలో మీరు చాలా మార్పు వచ్చింది సార్ అని వసు అనగా ఆ మార్పు కారణం నువ్వే అని అంటారు రిషి. ఆ తర్వాత ఇద్దరూ రోడ్ సైడ్ కారు నిలబెట్టి అక్కడ కొబ్బరిబోండం తాగుతారు. అప్పుడు వారిద్దరూ గతంలో కొబ్బరి నీళ్లు తాగుతూ మాట్లాడుకున్న మాటలు అని గుర్తు చేసుకుంటారు.

ఆ తర్వాత రిషి,వసు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి నీకోసం ఒక గిఫ్టు తెచ్చాను అని చెప్పాను కదా అడగవా అని అనగా అడిగి తీసుకుంటే అది గిఫ్ట్ ఎలా అవుతుంది సార్ అని అనడంతో అది కూడా నిజమే అని అంటాడు రిషి. ఆ తర్వాత రిషి వసుకి గిఫ్ట్ ఇవ్వగా అది ఓపెన్ చేసి చూసి వసు ఆశ్చర్యపోతుంది.

అందులో లవ్ సింబల్ లో రిషి ఫోటో ఉండి ఐ లవ్ యు అని రాసి ఉంటుంది. అది చూసిన వసు ఐ లవ్ యు అని అనగా వెంటనే రిషి ఐ లవ్ యు వసు నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అనడంతో అప్పుడు వసు మీరంటే కూడా నాకు చాలా ఇష్టం సార్ అంటూ వెనుక వైపు నుంచి వచ్చి రిషిని కౌగిలించుకుంటుంది.

Read Also :  Karthika Deepam May 26 Today Episode : జ్వాలాపై కోపంతో రగిలిపోతున్న స్వప్న,శోభ.. గతాన్ని గుర్తు చేసుకున్న సౌందర్య..?

Guppedantha Manasu May 26 Today Episode: వసుకి ఐ లవ్ యు చెప్పిన రిషి..ప్రేమతో హత్తుకున్న వసు..?
   

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.