Guppedantha Manasu: రిషి, వసుని విడగొట్టే ప్రయత్నంలో దేవయాని.. ఆలోచనలో పడ్డ మహేంద్ర జగతి?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ధరణి వసుధార ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో జగతి జరిగిన విషయాలు తలుచుకొని ఆనంద పడుతూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ఇదేంటి జగతి జరిగిన విషయాలకు నువ్వు ఆనందంతో ఉబ్బి తప్పిపోయి ఎగరే గంతులు వేస్తుంటావు సంతోషంలో ఒక వంద రకాల స్వీట్లు చేస్తుంటావ్ అని ఎన్నెన్నో ఊహించుకున్నాను కానీ ఇలా మౌనంగా ఉన్నావేంటి అని అంటుంది. పెళ్లి అనగానే గుండెల్లో ఈ వీణలు మోగినట్టు ఉంటుంది కదా మరి ఇలా బట్టలు సర్దుకుంటూ ఉన్నావు అంటే ఏమైనా ప్లాన్స్ వేస్తున్నావా అని అనగా వెంటనే జగతి సీరియస్ అవడంతో నేను మాట్లాడేది విను చెప్పనివ్వు జగతి అని అంటుంది.

Advertisement

కొడుకు పెళ్లి అని నువ్వు మహేంద్ర చాలా సంతోషపడుతున్నారేమో కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి జగతి మీరు కేవలం తల్లిదండ్రులు మాత్రమే కానీ రిషికి నా మాట అంటే వేదం అని అంటుంది. రిషి పెళ్లి జరుగుతుందేమో అని సంతోషంగా ఉన్నావేమో ఎట్టి పరిస్థితులలోను ఈ పెళ్లి జరగదు జరగనివ్వను అని అంటుంది దేవయాని. అప్పుడు జగతి ఇప్పటిదాకా మీరు చాలా మాట్లాడారు కానీ మీ మీద గౌరవం ఉంది అందుకే నేను ఏం మాట్లాడలేకపోయాను అనడంతో అదే నాకు ప్లస్ పాయింట్ అయింది జగతి నువ్వు ఏమి చేయలేకపోతున్నావు అందుకే అని అంటుంది.

ఇంతలోనే మహేంద్ర అక్కడికి రావడంతో నాకు ఏదో చెప్పాలని అనిపించింది అందుకే చెప్పాను వెళ్ళి జగతిని అడుగు మహేంద్ర అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది జగతి అని అడగడంతో ఏం చెప్పాలి మహేంద్ర ఎప్పుడూ ఉండేదే కదా అక్కయ్య గారికి వసు, రిషి ల పెళ్లి జరగడం ఇష్టం లేదు దానిని ఆపేస్తాను అని డైరెక్ట్ గా చెబుతోంది అని అంటుంది జగతి. అప్పుడు వారిద్దరూ ఆలోచనలో పడతారు. మరొకవైపు ఏంటి ఈ పొగరు వచ్చినప్పటి నుంచి ఒక మెసేజ్ చేయలేదు కనిపించలేదు ఏం చేస్తుంది అయినా ఎప్పుడు నేనే మెసేజ్ చేయాలా అని అనుకుంటూ ఉంటాడు.

ఆ తరువాత రిషి వస్తారా కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ వసుధర జరిగిన విషయానికి ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. లేదు సార్ జరిగిన విషయానికి నా మనసు ఉప్పొంగిపోయింది ప్రతి ఆడపిల్ల పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అని అంటుంది. ఇప్పుడు నేను అక్కడికి రావాలా ఇక్కడికి వస్తావా అనడంతో వద్దు సార్ బాగుండదు. పెళ్లి కాకుండానే మనిద్దరం ఇలా ఒకే రూములో అనడంతో వెంటనే హలో ఐయామ్ డీసెంట్ బాయ్ అని అంటాడు రిషి. అలా వాళ్లిద్దరూ సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

మరొకవైపు దేవయాని పడుకోకుండా మొబైల్ చూస్తూ ఉండడంతో ఈ టైంలో ఫోన్ ఏంటి దేవయ్య అని పడుకో అని అనగా సరే అని మళ్ళీ మొబైల్ చూడడంతో ఎప్పుడూ అందరిని డిస్టర్బ్ చేయడమేనా పడుకో దేవయాని అని అనడంతో వెంటనే దేవయాని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రిషి ఏంటి ఈ పొగరు కనిపించడం లేదు అని వసుకి మెసేజ్ చేసి అక్కడికి రమ్మని చెబుతాడు. తర్వాత వసు అక్కడికి రావడంతో వాళ్లిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు వెళ్లి పడుకోండి అనడంతో వెంటనే వసుధారా మేడం బయట చలిగా ఉంది మీరు వెళ్లి పడుకోండి లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధర వల్ల బావకి దేవయానికి ఫోన్ చేసి ప్లాన్ వేస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మహీంద్ర వదిన అని పిలవడంతో టెన్షన్ పడుతుంటుంది దేవయాని.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel