Karthika Deepam Aug 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య, కార్తీక్ ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, కార్తీక్, దీప ల ఫోటోలు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా అది చూసి ఆనందరావు, హిమ కూడా ఎమోషనల్ అవుతారు. మమ్మల్ని ఇలా వదిలేసి ఒంటరి వాళ్లను చేసి మీరు మాత్రం వెళ్ళిపోయారా అంటూ సౌందర్య మరింత ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఆనంద్ రావు సౌందర్యకు ధైర్యం చెబుతాడు.
అప్పుడు హిమ నానమ్మ సౌందర్య తప్పకుండా వస్తుంది కదా అని అనగా వెంటనే సౌందర్య వస్తుంది అమ్మ వెతికిస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత సౌందర్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. మరొకవైపు దీప, సౌర్య ఒకే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. దీప గతంలో జరిగిన విషయాలను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
Karthika Deepam Aug 18 Today Episode : ఇంద్రమ్మ దంపతులపై కోప్పడిన సౌర్య..
ఆ తర్వాత డాక్టర్ నర్స్ ఇద్దరు దీప గురించి మాట్లాడుకుంటూ బాధపడతారు. మరోవైపు బస్సు మధ్యలో తినడం కోసం ఆపగా సౌర్య నీ ఇంద్రమ్మ దంపతులు తినడానికి పిలుచుకొని వెళ్తారు. అక్కడ శౌర్య తింటూ ఉండగా పొలమారడంతో ఇంద్రమ్మ నీళ్ల కోసం వెళుతుంది. అప్పుడు అక్కడ ఎవరి దగ్గర 500 రూపాయలకి చిల్లర లేకపోవడంతో ఇంతలోనే దీప అక్కడికి వచ్చి ఇందిరమ్మకు వాటర్ బాటిల్ కొనిస్తుంది.
ఆ తర్వాత ఇంద్రమ్మ, దీప కు థాంక్స్ చూపి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంద్రమ్మ సౌర్యకి జరిగింది మొత్తం వివరించగా శౌర్య, దీపకు థాంక్స్ చెప్పాలి అనుకుంటుంది. ఆ తర్వాత దీప బస్సు దిగి వెళ్లిపోతూ సౌర్య, దుప్పటి కప్పుకుని ఇంద్ర మ్మ ఒడిలో పడుకోవడంతో అప్పుడు దీప, శౌర్య తల నిమిరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సౌర్యకు మెలుకువ రావడంతో నాకు నీళ్లు ఇచ్చిన ఆవిడకు థాంక్స్ చెప్పాలి అనుకున్నాను అప్పుడే వెళ్లిపోయిందా అని బాధపడుతుంది. బస్సు దిగిన తర్వాత రోడ్డుపై వంటలక్క ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరొకవైపు సౌర్య వాళ్ళు ఆటోలో హైదరాబాద్ కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంద్రమ్మ దంపతులు ఎలా అయినా బంగారాన్ని వాళ్ల నానమ్మ తాతయ్య దగ్గర చేర్చాలి అనడంతో సౌర్య కోపంతో ఆటో దిగాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఇంద్రమ్మ దంపతులు సౌర్యకి నచ్చ చెబుతారు.
Read Also : Karthika Deepam Aug 17 Today Episode : డాక్టర్ బాబు ఇంట్లో వంట చేసిన దీప..ఒక్కటైన డాక్టర్ బాబు,వంటలక్క..?