Karthika Deepam Aug 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీపన కాపాడిన డాక్టర్ దీపని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో డాక్టర్ వల్ల అమ్మ,దీపకు భయపడద్దు ధైర్యంగా ఉండమని ధైర్యం చెబుతుంది. దీప కూడా ఆమె మాటలకు కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. మరొకవైపు ఇంద్రుడు దంపతుల దగ్గర శౌర్య ఎమోషనల్ అవుతూ నేను మా ఇంటికి వెళ్ళను అక్కడికి వెళ్తే మా అమ్మ నాన్నలను చంపిన ఆ హిమ అక్కడే ఉంటుంది. తనను చూస్తూ ఆ ఇంట్లో నేను ఉండలేను అని అంటుంది.

Karthika Deepam Aug 17 Today Episode : కార్తీకదీపం సీరియల్ ఒక్కటైన డాక్టర్ బాబు,వంటలక్క..
కానీ ఇంద్రుడు చంద్రమ్మ ఎలా అయినా సౌర్యని హైదరాబాద్ కి పంపించాలి అని అనుకుంటారు. ఆ అమ్మాయి సంగతి పక్కన పెట్టు మీ నానమ్మ తాతయ్య నీకోసం చాలా బాధపడుతుంటారు వారిని అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటారు. అలా మొత్తానికి హైదరాబాద్ కు వెళ్లడానికి సౌర్య ను ఒప్పిస్తారు. సౌర్య ఒప్పుకోవడంతో వారు సంతోషపడుతూ ఉంటారు. మరొకవైపు డాక్టర్ వల్ల అమ్మ ఇద్దరు మనుషులని పిలిపించి వంటలు చేయమని చెబుతుంది.
కానీ మీరు ఉప్పు కారం సరిగా వేయరు అని అనడంతో వెంటనే దీప వంటగది ఎక్కడ తాను వంట చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత దీప చేసిన వంటలు తినే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. అలా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దీప తన గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి తన వాళ్ల కోసం వెళ్తాను అనడంతో ఆ డాక్టర్ వాళ్ళు సరే అని అంటారు.
ఇక మరుసటి రోజు దీపా సౌర్య అనుకోకుండా ఒకే బస్సు ఎక్కి హైదరాబాద్ కు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరోవైపు సౌందర్య వాళ్ళు తమ ఇంటిని ఖాళీ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు సౌందర్య కొడుకు కోడళ్ళ ఫోటోను చూసి బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప గుడిలో దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడు డాక్టర్ బాబు దీప అని పిలవడంతో దీప సంతోషంతో అక్కడికి వెళుతుంది.