Karthika Deepam Aug 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య, ఇంద్రమ్మ దంపతులపై కోప్పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఇంద్రమ్మ దంపతులు మేము ఊరికే అన్నాము బంగారం నువ్వు అంత కోప్పడకు నువ్వు ఆ ఇంటికి వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మేము కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వస్తాము అని అనగా శౌర్య మాత్రం ఆ ఇంటికి వెళ్లడం నాకు ఇష్టం లేదు మా అమ్మానాన్నలను చంపిన ఆ హిమ ముందు నేను ఉండలేను అని కోపంగా అరిచి చెబుతుంది.
నన్ను వెంటనే తీసుకెళ్లండి నేను ఆ ఇంటికి రాను అంటూ గోల గోల చేస్తుంది సౌర్య. మరొకవైపు దీప కూడా ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది. తాను బతికే ఉన్నాను అని తెలిస్తే సౌందర్య వాళ్ళు ఆనందపడతారని కార్తీక్ కూడా బతికే ఉన్నాడు అంటే వారి ఇంకా సంతోషపడతారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది దీప. మరొకవైపు ఇంద్రమ్మ దంపతులు మీ నానమ్మ తాతయ్య నిన్ను చూడగానే నీ కోపం మొత్తం పోతుంది.
Karthika Deepam Aug 19 Today Episode : బాధతో కుమిలిపోతున్న వంటలక్క..
అయినా కూడా నీకు కోపంగా ఉంటే నువ్వు అక్కడ ఉండకు మాతో వచ్చేయి అని చెబుతారు ఇంద్రమ్మ దంపతులు. మొత్తానికి శౌర్య, ఇంద్రమ్మ దంపతులు ఇంటి దగ్గరికి చేరుకుంటారు. మొదట ఇందిరమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళగా అమెరికాకు వెళ్లిపోయారు అని చెప్పడంతో సౌర్య చాలా బాధపడుతుంది. ఆ తర్వాత దీప కూడా ఇంటి దగ్గరికి రాగా అమెరికాకు వెళ్లిపోయారు అని చెప్పడంతో బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది.
మేము ఇక రాము అనుకొని పిల్లల్ని అమెరికాకు తీసుకెళ్లినట్టు ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది దీప. మరొకవైపు దీపావళి కాపాడిన డాక్టర్ వాళ్ళ అమ్మతో దీప గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి యాక్సిడెంట్ అయిన రోజు ఒక పేషెంట్ జాయిన్ చేశారు అతని ఆరోగ్యం కుదుటపడింది అని చెబుతాడు. అదే విషయం డాక్టర్ దీప కి చెప్పడంతో చాలా సంతోషిస్తుంది.
ఇక మరుసటి రోజు ఉదయం గుడికి డాక్టర్ బాబు బతికి ఉండాలి అని ఎమోషనల్ అవుతూ గుడిలో దేవుడిని వేడుకుంటూ ఉండగా, ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చినట్లుగా ఊహించుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ రాలేదు అని తెలుసుకొని ఎమోషనల్ అయి హాస్పిటల్ కి వెళ్లి చూడాలి అనుకుంటుంది. ఆ తర్వాత దీప హాస్పిటల్ కి వెళ్ళగా అతని నిన్ననే డిశ్చార్జ్ చేశారు ఆయన భార్య తీసుకెళ్ళింది అనడంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ పర్స్ ఇవ్వడంతో అది చూసి దీపా మరింత శాక్ అవుతుంది.