Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య ఇంద్రుడు దంపతులపై సీరియస్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్లో సౌందర్య సరే నాతో పాటు వెళ్దాం పద అని అనగా సౌర్య నేను రాను నానమ్మ ఆ హిమ ఉన్న చోటకి నేను రాను అని అంటుంది. అమ్మ నాన్నలు దొరికే వరకు నేను రాను ఒకవేళ అమ్మానాన్నలు దొరికినా కూడా నేను ఆ హిమను క్షమించను అని అనడంతో మన కర్మకు జరిగితే దానిని వేరే వాళ్లను బాధ్యులు చేస్తావా అని అంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య కోపంతో మీ అమ్మానాన్నలు లేరు. ఆ యాక్సిడెంట్ లోనే చనిపోయారు అని అనడంతో చారుశీల ఇంద్రుడు అలా మాట్లాడకు అని చెబుతారు.
అప్పుడు ఇంద్రుడు అలా మాట్లాడకండి అమ్మ ఆ పసిపాప ఏదో నమ్మకంతో ఉంది దాన్ని చెడగొట్టొద్దు అని అంటాడు. అప్పుడు నువ్వు ఎన్నైనా చెప్పు నానమ్మ నేను రాను అనడంతో సౌందర్య బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఇంద్రుడు సౌందర్య కాళ్ల పై పడతాడు. మేడం ప్లీజ్ మేడం సౌర్యమ్మ ను తీసుకెళ్లద్దండి మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఇక్కడే ఉంచండి ఆ తర్వాత మీరు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని అంటాడు. దాంతో చేసేదేమీ లేక సౌందర్య మౌనంగా సరే అని అంటుంది. మరొకవైపు దీప, హేమచంద్ర దగ్గరికి వెళుతుంది.
అప్పుడు దీప తన రిపోర్ట్స్ చూపించిన తనకు మొత్తం హెల్త్ బాగానే ఉందా ఇంకా ఏమైనా సమస్య ఉందా అని అడగగా అలాంటిదేమీ లేదు నీ ఆరోగ్యం బాగానే ఉంది అని చెబుతాడు హేమచంద్ర. డాక్టర్ బాబు ప్రవర్తన మాత్రం ఇంకోలా ఉంది అన్నయ్య నన్ను ఏ పని చేయడం లేదు అనడంతో డాక్టర్ బాబు ప్రేమ ని నువ్వు అనుమానిస్తున్నావు దీపమ్మ అని అంటాడు. అంతే కదా అన్నయ్య అనడంతో అంతే నువ్వు ఎక్కువ భయపడకు, ఎక్కువ ఆలోచించకు అని ధైర్యం చెబుతాడు హేమచంద్ర.
మరొకవైపు ఇంట్లో కార్తీక్ దీప కోసం వెతుకుతుండగా పండరి వచ్చి దీపమ్మ గుడికి వెళ్ళింది అని చెబుతుంది. అప్పుడు సరే అని పండరి నువ్వు వెళ్లే దీప అని పిలుచుకొని ఇంటికి రా నాకు చిన్న పని ఉంది వెళ్తాను అని అంటాడు. దీప బయటికి వెళ్తే.. సౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది అని కార్తీక్ అనగా వెంటనే పండరి అనుమానం వచ్చి సారూ దీపమ్మ పాప కోసం వెతికడం మీకు ఇష్టం లేదా అనగా ఏం మాట్లాడుతున్నావు పండరి దీప ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నేను వెతకొద్దని చెబుతున్నాను.
వెంటనే పండరి ఆరోజు కూడా పొద్దులో ఉన్న ఇంద్రుడు వాళ్ళు సాయంత్రానికి లేరు ఆరోజు మీకు తప్ప వేరే ఎవరికీ తెలియదు మీరే కాల్ చేసి చెప్పారేమో అని అనుమానం వచ్చింది అని అనగా కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు పండరీ సౌర్య విషయం గురించి మాట్లాడుతుండగా కార్తీక్ వంట గురించి మాట్లాడి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు చారుశీల వాళ్ళ ఫ్రెండ్ దీప
రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది. చూసావు కదా మరి ఇంకా ఎందుకు అడుగుతావు అని చారుశీల తన ఫ్రెండ్ అడగగా ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు అనడంతో ఇదంతా మా మోనిత మేడం కోసం చేస్తున్నాను అని అంటుంది చారుశీల.
మోనిత మేడం నన్ను ఒక కోరిక కోరింది ఆ కోరికను తప్పకుండా నిర్వహిస్తాను దీపను కార్తీక్ ని ఎప్పటికీ కలవకుండా చేస్తాను అని అంటుంది. నేను ఆ మోనిత మనిషిని అంటూ తన నిజ స్వరూపం బయటపెడుతుంది చారుశీల. మరొక కార్తీక్ ఇంద్రుడి కోసం హోటల్లో ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో దీప అక్కడికి రావడంతో దీప దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే ఇంద్రుడు అక్కడికి రావడంతో కార్తీక్ పక్కకు వెళ్లిపోమనిసైగా చేస్తాడు. అప్పుడు దీప ఇంద్రుడిని చూసి తనని ఫాలో అవుతూ ఆటోలో వెళుతుంది.. అప్పుడు కార్తీకదీపం ఒక చోటికి వెళ్లగా అక్కడ ఇంద్రుడు తప్పించుకుని వెళ్లిపోవడంతో దీప బాధ పడుతూ ఉంటుంది.