Karthika Deepam: సౌందర్యను చూసి బాధపడుతున్న కార్తీక్.. సౌర్య పై సీరియస్ అయిన సౌందర్య?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్య చారుశీల ఒకచోట కలుసుకుంటారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్లో చారుశీల చుట్టూ కార్తీక్ ఉన్నాడు లేదో చూస్తుండగా ఇంతలో కార్తీక్ అక్కడికి రావడంతో అది చూసి సంతోషపడుతుంది. ఇప్పుడు చెప్పండి ఆంటీ మీ మనవరాలు గురించి ఏదో మాట్లాడాలి అన్నారు కదా అని అనగా ఆ నెంబర్ కి మళ్ళీ ట్రై చేశాను అయినా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇంద్రుడు నా మనవరాలు ఇవ్వకూడదు అనుకున్నాడు అందుకే రాంగ్ నెంబర్ ఇచ్చినట్టు ఉన్నాడు. నా మనవరాలు ఎక్కడ ఉందో తన అడ్రస్ ఏమైనా తెలుసా అని అడగగా లేదు ఆంటీ అని అంటుంది.

Advertisement

Advertisement

అప్పుడు చారుశీలన సౌందర్య రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ అమ్మాయి నా మనవరాలు ఎక్కడ ఉందో చెప్పు నేను నాతో పాటు హైదరాబాద్కు తీసుకెళ్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సౌందర్య. దూరం నుంచి సౌందర్య ని చూసిన కార్తిక్ ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు మమ్మీ. ఒకప్పుడు ఏది కావాలి అన్న ఆర్డర్ వేసే దానివి ఇప్పుడు అలాంటిది నా కోసం నా కూతురు కోసం ఇలా అందరిని రిక్వెస్ట్ చేస్తుండడం అలా చూడలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Advertisement

ఆ తర్వాత సౌందర్య బాగా గుర్తు తెచ్చుకోమ్మ ఆరోజు నా మనవరాలు ఇంకా ఏమైనా చెప్పిందా అని అడగగా అప్పుడు చారుశీల కార్తీక్ వైపు చూడగా కార్తీక్ చెప్పమని సైగ చేయడంతో రా గుర్తుకొచ్చిందా ఆంటీ మీ పాప ఎక్కడ ఉందో నాకు తెలుసు ఒకరోజు మా డ్రైవర్ పాపని ఇంటి దగ్గర దిగబెట్టాడు మా డ్రైవర్ రాగానే అడిగి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను రేపు ఉదయాన్నే హాస్పిటల్ కి రండి అని చెబుతుంది. సరే అని అక్కడ నుంచి సౌందర్య వెళుతుండగా కార్తీక్ కి ఇంకొద్దిసేపు తన అమ్మని చూపించాలి అనుకున్న ఇలా మళ్లీ సౌందర్యాన్ని వెనక్కి పిలిచి అసలు సౌర్య కి నమ్మనున్నది ఇంకా బతికే ఉన్నారని నమ్మకం ఎలా కలిగింది అని ప్రశ్నిస్తుంది.

Advertisement

అప్పుడు సౌందర్య తన గతంలో జరిగిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ మాట్లాడుతుంది. ఆ తరువాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్తీక్ అక్కడికి వస్తాడు. చూసావు కదా చారుశీల మా అమ్మ ఇంతలా బాధపడుతుందో కాదు నేనే బాధ పెడుతున్నాను. దీప కోసం ఎంతలా ఆరాటపడుతుందో చూసావు కదా అందుకే నేను నిజం చెప్పాలి అనుకోవడం లేదు అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. తొందరగా ఇంటికి వెళ్ళు అని అంటుంది.

Advertisement

మరొకవైపు ఇంద్రుడు తినకుండా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చంద్రమ్మ ఏం ఆలోచిస్తున్నావు గండ అని అనగా ఏం లేదు చంద్రమ్మ జ్వాలమ్మ తొందర్లోనే మన దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోతుందనిపిస్తుంది అనగా పొద్దుపొద్దున్నే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి గండ అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి చారుశీల మేడం రమ్మని చెప్పింది అనడంతో ఇంద్రుడు దంపతులు షాక్ అవుతారు.

Advertisement

ఎందుకమ్మా అని అనడంతో ఎందుకు ఏంటి బాబాయ్ నేను హాస్పిటల్లో పోస్టర్ అతికించాను కదా నాకోసం మా అమ్మ నాన్నలు వచ్చినట్టున్నారు అందుకే కారు పంపించింది అని అంటుంది. ఆ తర్వాత ఇందులో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ కి బయలుదేరుతారు. మరొకవైపు సౌందర్య చారుశీల తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సౌర్య హాస్పిటల్ కి వచ్చి తన నానమ్మని చూసి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుండగా అప్పుడు వెనకాలే సౌందర్య వెళ్లి ఆగండ్రా అని అంటుంది. ఇక ఇంద్రుడు దగ్గరికి వెళ్లి ఇంద్రుడు కాలర్ పట్టుకుని ఇంకా ఎన్నాళ్ళు ఎలా తిరుగుతారు.

Advertisement

ఎన్ని ఊర్లను మారతారు అని సీరియస్ అవుతుంది. అప్పుడు సౌర్య మాట్లాడడంతో నువ్వు నోరుమూయ్ ఎక్కువ మాట్లాడొద్దు అని తిడుతుంది సౌందర్య. లేదమ్మా ఇదంతా పాప ఇస్తే ప్రకారమే చేసాము అని ఇంద్రుడు దంపతులు అనడంతో నోరు మూయండి చేయాల్సినంత చేసి ఇప్పుడు తప్పంతా నా మనవరాలుది అన్నట్టు మాట్లాడుతున్నారు అని సీరియస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శౌర్య వాళ్ళు చెప్పింది నిజమే నానమ్మ అంతా నా ఇష్టప్రకారమే చేస్తున్నారు అని అంటుంది. దాంతో సౌందర్య సీరియస్ అవుతుంది.

Advertisement
Advertisement