Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప, కార్తీక్ ఇద్దరు ఇంద్రుడి వెంటపడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో దీప బాధపడుతూ ఆ ఇంద్రుడు ఎప్పుడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాడు డాక్టర్ బాబు అని బాధపడుతూ ఉండగా ఎన్ని రోజులని తప్పించుకుంటాడు దీప ఏదో ఒక రోజు దొరుకుతాడు నేను వెతుకుతాను. సరే నువ్వు ఇంటికి వెళ్ళు నేను హాస్పిటల్ కి వెళ్తాను అని అంటాడు కార్తీక్. మరొకవైపు హోటల్ దగ్గరికి వెళ్లిన ఇంద్రుడు ఈరోజు ఎలాగోలా దీపమ్మ దగ్గర నుంచి తప్పించుకున్నాను అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు.
అప్పుడు దీపమ్మ ఇంటికి వెళ్లిపోయిందా సార్ అనడంతో ఆ వెళ్లిపోయింది ఇంద్రుడు అని అంటాడు కార్తీక్. ఇలా ఎన్ని రోజులు అని తప్పించుకొని తిరగాలి సార్ అని అనగా నా సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు తప్పదు ఇంద్రుడు అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ సరే నువ్వు రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా నాకు చిన్న పని ఉంది వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆనందరావు వస్తాడు.
ఏం ఆలోచిస్తున్నావ్ సౌందర్య సౌర్యని వాళ్ల దగ్గరే వదిలిపెట్టి వచ్చావు కదా ఇంకా ఏమీ ఆలోచిస్తున్నావు అనడంతో అక్కడి మనుషుల మీద వారి ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది అని అంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య అక్కడ జరిగిన విషయాలు ఆనంద్ రావు చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు దీప జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే పండరి అక్కడికి రావడంతో రేపు ఉదయాన్నే నీకు ఏమైనా పని ఉందా పండరి అని అడగగా పని ఎప్పుడూ ఉండేదేలే దీపమ్మ నువ్వు చెప్పు అని అనగా ఈరోజు ఉదయం ఇంద్రుడు కనిపించాడు నేను డాక్టర్ బాబు పట్టుకుందాం అనుకునే లోపే తప్పించుకుని వెళ్ళిపోయాడు అని బాధగా మాట్లాడుతుంది దీప.
అప్పుడు పండరీ కార్తీక్ అన్న మాటలు తలుచుకొని నాకు ఇంట్లో పనితో పాటు బయట పని కూడా ఉంది దీపమ్మ నువ్వు కార్తీక్ సార్ తో పాటు బయటికి వెళ్లి వెతుకు అని అనగా వెంటనే దీప సీరియస్ అవుతూ నేను ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు డాక్టర్ బాబుకి నా కూతుర్ని వెతకడం ఇష్టం లేదని అనిపిస్తుంది అని అంటుంది దీప. అలా ఎందుకు అనుకుంటున్నావు దీపమ్మ అని పండరి అడగడంతో ఆయన ప్రవర్తన అలాగే ఉంది. సౌరిని వెతుకుదాం అన్న ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు అని అనగా ఇంతలోనే అక్కడికి కార్తీక్, చారుశీల వస్తారు. అప్పుడు కార్తీక్ తొందరగా అన్నం పెట్టు పండరి దీపకు ఇంజక్షన్ వేయాలి అని అంటాడు.
వెంటనే దీప మొన్నటి వరకు టాబ్లెట్స్ అన్నారు ఇప్పుడు మళ్ళీ ఇంజక్షన్ల డాక్టర్ బాబు అని అడుగుతుంది. అప్పుడు చారుశీల ఏంటి దీప కార్తీక్ మీద అనుమాన పడుతున్నావా నమ్మకం లేదా అనగా లేదు అని అంటుంది దీప. అప్పుడు దీప కార్తిక్ పై సీరియస్ అవుతూ మీ ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది. సౌర్యని వెతుకుదాము అన్న ప్రతిసారి ఏదో ఒక రకంగా మీరే అడ్డుపడుతున్నారు. ఆ మాటను దాటేస్తున్నారు. నేను వెతుకుతాను అంటే నన్ను వెళ్ళనివ్వరు. మీరు వెళ్లి వెతకరు అని దీప బాధతో మాట్లాడగా అప్పుడు చారుశీల నాకు అదే కావాలి దీప నువ్వు కార్తీక్ మీద పూర్తిగా నమ్మకాలు కోల్పోవాలి అని అంటుంది.
అప్పుడు దీప ఎలా అయిన హైదరాబాద్ కు తీసుకెళ్లండి అని పట్టుబట్టగా కార్తీక్, చారుశీల చెప్పే ప్రయత్నం చేయడంతో దీప ఎవరి మాటలు వినదు. మరొకవైపు నిద్రలో ఉదయ ఉలిక్కిపడి లేయడంతో ఏమైంది జ్వాలమ్మ ఎందుకు అరిచావు అని అడగగా అమ్మ ఇంట్లోనే ఉందని అమ్మకు హెల్త్ బాగోలేదని కల వచ్చింది పిన్ని అని అంటుంది. అప్పుడు సౌర్య మాటలు విన్న ఇంద్రుడు, ఇంద్రమ్మ కూడా బాధపడుతూ ఉంటారు.
అప్పుడు వారి ప్రవర్తన మీద అనుమానం రావడంతో శౌర్యవారిని నిలదీస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమీ లేదని చెప్పి తప్పించుకుంటారు. మరొకవైపు దీప జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉండగా చిల్లర కోసం ఒక హోటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కార్తీక్ ఇంద్రుడు పక్కపక్కన కూర్చునే మాట్లాడుతూ ఉండగా అది చూసి దీప షాక్ అవుతుంది. అప్పుడు కార్తీక్ ఇంద్రుడికి ఉంచుకోమని డబ్బులు ఇస్తాడు. అది చూసిన దీప మరింత షాక్ అవుతుంది. అప్పుడు చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప.