వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam: రెస్టారెంట్ కి వెళ్ళిన ప్రేమ్, హిమ..నిరూపమ్ కీ పెళ్లి చేయాలి అనుకుంటున్న స్వప్న..?

Karthika Deepam April 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రోడ్డు పై ఒక ముసలావిడకు ఆక్సిడెంట్ అవ్వడంతో జ్వాలా హాస్పిటల్ కీ తీసుకొని వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా ఆ ముసలావిడ కు ఎలా ఉంది డాక్టర్ సాబ్ అని అడగగా, కాసేపట్లో మెలకువ వస్తుంది అని చెబుతాడు ... Read more

By Ramesh Babu

Published on: April 22, 2022 9:03 AM

Updated on: April 22, 2022 4:41 PM

Karthika Deepam

---Advertisement---

Karthika Deepam April 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రోడ్డు పై ఒక ముసలావిడకు ఆక్సిడెంట్ అవ్వడంతో జ్వాలా హాస్పిటల్ కీ తీసుకొని వస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా ఆ ముసలావిడ కు ఎలా ఉంది డాక్టర్ సాబ్ అని అడగగా, కాసేపట్లో మెలకువ వస్తుంది అని చెబుతాడు నిరూపమ్. అప్పుడు నిరూపమ్ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని జ్వాలాని అడగగా గతం తెచ్చుకుని బాధపడుతుంది జ్వాలా. మరొకవైపు ఆ ముసలావిడకు స్పృహ వస్తుందేమో అని హిమ భయపడుతూ ఉంటుంది.

Karthika Deepam
Karthika Deepam

ఇంతలో జ్వాలా అక్కడి నుంచి పక్కకు వచ్చి హిమ ను కనిపెట్టే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది అని బాధ పడుతూ ఉంటుంది. మరొకవైపు ఆనంద్, అరుణ వాళ్ళ అక్కను మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు వాళ్ళ వివరాలు చెప్పు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె నీకు ఎవ్వరూ లేరు నువ్వు అనాధ అంటూ కోప్పడుతుంది.

మరొకవైపు సౌందర్య జ్వాలా నీ కొట్టినందుకు బాధ పడుతూ ఉంటుంది. ఎక్కడైనా కనిపిస్తే స్వారీ చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు స్వప్న ఆనంద్ రావు దగ్గరికి వచ్చి నిరూపమ్ కీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని చెబుతుంది. ఆ పిల్లలకు నాకు నచ్చిన అమ్మాయి తో పెళ్లి చేస్తాను అని చెబుతుంది.

అప్పుడు ఆనందరావు ఇంట్లో అమ్మాయినీ పెట్టుకొని బయట వాళ్లకు చేయడం ఏమిటి అని అడగగా, అప్పుడు స్వప్న హిమ నష్ట జాతకురాలు,మీ చుట్టరికం మాకు అవసరంలేదు అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది స్వప్న. మరొకవైపు జ్వాలా, హిమ కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆనంద్ రావ్, సౌందర్య లు అక్కడికి వచ్చినట్లు అప్పుడు జ్వాలా హిమ పై సౌందర్య దంపతుల పై విరుచుకుపడినట్లు హిమ కలగంటుంది.

రేపటి ఎపిసోడ్ లో భాగంగా సౌందర్య, ఆనందరావు బయటకు వెళుతూ అనుకోకుండా జ్వాలా ఆటో దగ్గరికి వస్తారు. జ్వాలా ని చూసిన సౌందర్య స్వారీ అని జ్వాలా కాస్త కోపంగా పొగరుగా మాట్లాడడంతో సౌందర్య కోప్పడుతుంది. అప్పుడు జ్వాలా సౌందర్యం ఈ సీనియర్ సిటిజన్ అన్ని మాట్లాడటంతో ఆనందరావు నవ్వుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel