...

Viral video: నాక్కొన్ని పాలు పోయవా ప్లీజ్.. పిల్లి వేడుకోలు!

Viral video: ఈ సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అందులో చాలా వాటికి అసలు అర్థం పర్థం ఉండదు. కానీ తెగ వైరస్ అవుతుంటాయి. కానీ కొన్ని వార్తాంశాలు మాత్రం గుండెకు హత్తుకుంటాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కితకితలు పెట్టిస్తాయి. అలాంటిదే ఈ వార్త కూడా. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరస్ అవుతోంది. నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది. చాలా మంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. వివిధ దేశాలకు చెందిన వాటిని లక్షల్లో పెట్టి కొనుక్కొచ్చుకుని మరీ వాటిని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఇక కుక్కల తర్వాత స్థానం మాత్రం పిల్లులదేనని చెప్పాలి. పిల్లులను కూడా చాలా మంది పెంచుకుంటారు.

పిల్లులు కుక్కల మాదిరిగా యాక్టివ్ గా ఉండవు. వాటి పనేదో అవి చేసుకుంటాయి. ఇవి యజమానుల అటెన్షన్ ను కోరుకోవు. ప్రేమగా ఉన్నట్లు అనిపించదు. కానీ కుక్కలు అలా కాదు. అవి యజమానితోనే ఉంటాయి. వాటిని మనిషిలా పట్టించుకోవాలని కోరుకుంటాయి. ప్రేమను చూపిస్తాయి. అదే ప్రేమను ఆశిస్తాయి. అందుకే చాలా మంది కుక్కలకు కనెక్ట్ అయినంతగా పిల్లులకు కాలేరు. కానీ ఇక్కడ ఉన్న పిల్లిని చూస్తే ఇట్టే కనెక్ట్ అయిపోతారు. దాని పిల్లి వేషాలతో మన మనసులను దోచేస్తుంది. తన ఓనర్ ఆువుకు పాలు తీస్తుంటే పక్కనే కూర్చొని నాక్కూడా కావాలి. ప్లీజ్ పాలు పట్టవా.. అని క్యూట్ అడుగుతోంది. ఇక్కడ పిల్లి పాల కోసం తన ఓనర్ ను రిక్వెస్టు చేసి మరీ తను కావాలనుకున్నది సాధించింది.