Viral video: ట్రెండ్ మారుతోంది గురూ. దాన్ని ఫాలో కాకపోతే పాతబడి పోతాం. ట్రెండ్ ఏంటో తెలుసుకోవడం ముఖ్యం కాదు దాన్ని ఎలా ఫాలో అయ్యాం.. ఎంతమందిని ఇన్స్పైర్ చేశామన్నదే పాయింట్. ఒకప్పుడు పెళ్లిల్లు సాదాసీదాగా జరిగి పోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత క్రేజీగా ఉంటే అంతగా అందరి దృష్టిని ఆకర్షించగలం. అలాగే అంతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతాం.
పెళ్లి వేదికపై డ్యాన్సులు, అచ్చట్లు, ముచ్చట్లు ఎవరైనా చేస్తారు. క్రేజీగా ఏం చేశాం.. మన మార్కు చూపించామా లేదా అనేదే ముఖ్యం. అన్నట్లుగా తయారవుతున్నారు ఈ మధ్య వధూవరులు. పెళ్లి వేడుకలో లేదా రిసెప్షన్ వేడుకలో ఇలాంటివే కొన్ని ట్రిక్కులు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో వధువు వరుడిని స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేందుకు ప్రయత్నించింది. వరుడు వేరే వైపు చూస్తుండగా అదే అదను అనుకోని బలంగా నెట్టేసేందుకు ప్రయత్నించింది.
కానీ పెళ్లి కూతురు ప్లాన్ పసిగట్టిన పెళ్లి కొడుకు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అతను స్విమ్మింగ్ పూల్ లోకి పడిపోతూ తననూ పడేశాడు. తర్వాత ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ అల్లరి చేస్తూ ఒకరికొకరు ముద్దురు పెట్టుకుంటా గడిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వధూవరుల రోమాన్స్ కు ఫిదా అవుతున్నారు. పెళ్లి బట్టలతో నీళ్లలో అలా రోమాన్స్ చేయడం సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరూ అలాగే నవ్వుతూ సంతోషంగా జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram