Bullet bhasker father: తెలుబు బుల్లితెరపై ప్రసారం అయ్యే శ్రీ దేవి డ్రామా కంపెనీ ఈ మధ్య చాలా పాపులారిటీని సంపాదించింది. ఇందుకు ప్రధాన కారణం జబర్దస్త్ నుంచి ఇక్కడకు వచ్చిన కమెడియన్లుే. అయితే ఈ షోకి కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో మదలైనప్పటి నుంచి అటు ఎంటర్ టైన్ మెంట్ పరంగా, ఇటు ఎమోషనల్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా బుల్లెట్ భాస్కర్ తండ్రి శ్రీ దేవి డ్రామా కంపెనీ స్టేజీ పైనుంచి కింద పడిపోయాడు.
పెళ్లాం చెపితే వినాలి అనే కొత్త థీమ్ తో కమెడియన్స్ ఎంటర్ టైన్ చేశారు. ఈ ప్రోమోలో హైపర్ ఆదితో పాటు పలువురు సీరియల్ ఆర్టిస్టులు జంటగా వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలో స్టేజీపై ఏర్పాటు చేసిన కబడ్డీ ఆటలో బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా పాల్గొన్నారు. అయితే అఫ్పటి వరకూ ఎంతో హుషారుగా యాంకర్ రష్మీపై పంచులు వేసిన ఆయన… కబడ్డీ కుతకు వెళ్లి స్టేజీ పైనుంచి కుప్పకూలడం అందరినీ టెన్షన్ కి గురి చేసింది. అసలు ఏం జరిగిందనేది ఆదివారం ఎపిసోడ్ లో చూడాలి.