Rashmi gautam: బుల్లితెరపై హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రష్మీ, సుధీర్ ల మధ్య ఏం లేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏదో ఉందనేలా క్రియేట్ చేస్తూ.. క్యాష్ చేస్కుంటున్నారు మల్లెమాల టీం నిర్వాహకులు. అయితే ఈ మధ్య సుధీర్ వేరే ఛానెల్ కి వెళ్లడంతో రష్మీని ఓ ఆట ఆడేస్కుంటున్నారు. నీ వల్లే వెళ్లిపోయాడు.. మీ ఇద్దరూ కలిసే ప్లాన్ చేశారా అంటూ స్టేజీ మీదే ఆటపట్టిస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో అయితే బుల్లెట్ భాస్కర్ తండ్రి మరింత రెచ్చిపోయాడు. సుధీర్ లా మరి తన టాలెంట్ ని చూపించాడు.
రోహిణితో పెళ్లి స్కిట్ చేసిన బుల్లెట్ భాస్కర్ తండ్రి.. సుధీర్ లా డైలాగులు కొట్టాడు. నువ్వు చస్తే నేను ఏడుస్తాను కానీ.. నేను చస్తే మాత్రం నువ్వు ఏడవద్దు అంటూ ప్రపోజ్ చేశాడు. ఈ స్కిట్ అయిపోయాక.. రష్మీని మీ స్టోరీ ఏంటో చెప్పండంటూ పదే పదే అడిగాడు. దీంతో బుల్లెట్ భాస్కర్ మా నాన్న దగ్గరున్న మైక్ లాక్కొండని చెప్పడంతో.. నిర్వాహకులు మైక్ లాగేస్కున్నారు. కానీ రష్మీ గతంలో.. మా ఇద్దరి మధ్య ఏం లేదని.. కేవలం తాము స్నేహితులం మాత్రమేనంటూ చెప్పుకొచ్చింది.