Bangarraju Release : సంక్రాంతి బరి లోకి మేము వస్తున్నాం అంటూ ముందుగా అనౌన్స్ చేసిన సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అటు రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రెండు సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులకు కరోనా ఎదురుదెబ్బ తగిలింది. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు. ఓవైపు ఓమిక్రాన్ వ్యాప్తి,మరోవైపు కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నాయి.
సినిమా వాయిదా కు సంబంధించి ఇప్పటికే అమెరికాలోని డిస్ట్రిబ్యూటర్స్ కు అధికార సమాచారం కూడా ఇచ్చారు. RRR సినిమా వాయిదా పడినప్పుడే, రాధేశ్యామ్ సినిమా విడుదల పై కూడా సందేహాలు మొదలయ్యాయి. అయితే రాధే శ్యామ్ యూనిట్ మాత్రం ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చెబుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశాలు ఉండడం, ప్రజలు థియేటర్లకు దూరమయ్యే అవకాశాలు ఉండడంతో సినిమాను వాయిదా వేయడమే మంచిదని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది.
ఆచార్య, భీమ్లానాయక్ సినిమాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ కి కూడా చాలా ఎక్స్ పెర్టేషన్స్ కూడా ఉన్నాయి.ఎందుకంటే కరోనా తర్వాత కొంచెం కొంచెంగా కోలుకుంటున్న సినిమాలకు సంబంధించి,ముఖ్యంగా పెద్ద సినిమాలకు సంబంధించి ఒక ఆశ అయితే ఉండేది. కానీ ఒక్కసారిగా ఓమిక్రాన్ అనేది దెబ్బేసింది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఓమిక్రాన్ కారణంగా RRR కాస్త వాయిదా పడింది. అదే సమయంలో రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి కూడా వాయిదా పడుతుందనే ఊహాగానాలు బయటకు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లేవని చెప్పింది. కానీ కొద్ది సేపటి క్రితమే వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. సాధారణంగా పండగలకి పెద్ద సినిమాలు పోటీ వస్తూ ఉంటాయి.
దాంతో హీరోలందరూ చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎక్స్పెర్టెషన్స్ తగ్గినట్లుగానే కనిపిస్తోంది. రాధేశ్యామ్, RRR ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తాయనుకున్నాం. కానీ ఓమిక్రాన్ నేపథ్యంలో ఇవి రెండూ వాయిదా పడ్డాయి. ఈ సినిమాలు నెక్స్ట్ ఎప్పుడు విడుదల అవుతాయో త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.
రాథేశ్యామ్ రిలీజ్ వాయిదా..!
సంక్రాంతి పండగ బరిలో ఉన్న పెద్ద సినిమాలు వెనక్కి తగ్గడం వల్ల, ఈ అవకాశాన్ని చిన్న సినిమాల్లో క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది.ఈ నేపథ్యంలో ఇది ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి కొన్ని చోట్ల లాక్డౌన్ అనే రూమర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాధే శ్యామ్ సినిమాని పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also : Sri Reddy : నన్ను దాటుకునే జగన్ జోలికి వెళ్లాలి.. ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..