Sarkaru Vari Pata : అదేంటో భయ్యా.. నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా ఇట్టే హిట్ అయిపోతోంది.. మహేష్ కామెంట్స్!

Updated on: May 11, 2022

Sarkaru Vari Pata : మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాత సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబుకు ఎదురైన ప్రశ్నలు.. మహేష్ బాబు చెప్పిన సమాధానాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…

mahesh-babu-intresting-comments-on-latest-interview
mahesh-babu-intresting-comments-on-latest-interview

సర్కారీ వారి పాట సినిమా ట్రైలర్ లో మీరు ఎంతో కొత్త లుక్, హుషారుగా కనిపించారు దీనికి కారణం ఎవరు?
మహేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ సినిమా ఇంత కొత్తదనంగా,అందులో నా పాత్ర హుషారుగా కనిపించడానికి కారణం డైరెక్టర్ పరుశురాం అని వెల్లడించారు.

నాలుగు సంవత్సరాలుగా ఏది పట్టుకున్న విజయం అవుతుంది అన్నారు… ఈ విజయానికి కారణం?
మంచి కథలను ఎంపిక చేసుకోవడం. గత నాలుగు సంవత్సరాల నుంచి అద్భుతమైన జర్నీ కొనసాగుతోంది.. సర్కార్ వారి పాట కూడా మంచి విజయం అందుకుంటుంది.

Advertisement

పోకిరి సినిమాతో సర్కారీ వారి పాట చిత్రాన్ని పోల్చడానికి కారణం?
పోకిరి సినిమాలో తన పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుంది.పోకిరి సినిమా చూసినప్పుడు థియేటర్లో అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో సర్కారీ వారి పాట సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఈ సినిమాని పోకిరి సినిమా మహేష్ బాబు వెల్లడించారు.

డైరెక్టర్ పరుశురాం గురించి మీ మాటల్లో?
ఇప్పటివరకు తను ఎంతో మంది దర్శకులతో పనిచేశాను అయితే పరశురామ్ కూడా అద్భుతమైన రచయిత.అలాంటి అద్భుతమైన రచయిత ఒక డైరెక్టర్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పారు.

సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత ఈ గ్యాప్ లో ఏదైనా మార్పులు చేశారా?
ముందుగా ఈ సినిమాను మేం వాయిదా వెయ్యలేదు కరోనా కారణం వల్ల వాయిదా పడింది. అయితే మేం ఏం అనుకున్నాము సినిమాలో అదే ఉంచాము ఎక్కడ ఎలాంటి మార్పులు చేయలేదు.

Advertisement

మీ మెడ పైన టాటూ గురించి మీ మాటల్లో?
నా మెడ పై ఉండే ఈ టాటూ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కి దక్కుతుంది.భరత్ అనే నేను సినిమా తర్వాత నాకు లాంగ్ హెయిర్ లేకపోయినా లాంగ్ హెయిర్ పెట్టి మెడపై టాటూ వేసి ఇలా ఉంటుందని డైరెక్టర్ చూపించారని, అలా తన లుక్ ఎంతో అద్భుతంగా అనిపించడంతో వర్క్ మొదలు పెట్టామని తెలిపారు.

పాన్ ఇండియా సినిమాలు గురించి మీ ఆలోచనా?
తెలుగు సినిమా తీయడానికి ఎంత సమయం పట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా ఆలోచనలు లేవు. తెలుగు సినిమాలే పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్లాలని కోరుకుంటున్నాను.

మీ నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా సినిమా నేనా?
నా తదుపరి చిత్రం రాజమౌళితో ఉంటుంది ఆయన తీసిన సినిమా తప్పకుండా పాన్ ఇండియా సినిమా అవుతుంది.

Advertisement

సర్కారీ వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషన్ అవ్వడానికి కారణం?
కరోనా కారణం వల్ల ఈ రెండు సంవత్సరాలలో చాలా దగ్గరైన వారిని కోల్పోయాను. అందుకే ఎమోషనలయ్యా.ఈ విధంగా మహేష్ బాబు ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Read Also : Mahesh babu daughter: వాళ్ల అమ్మ కోప్పడితే.. మహేశ్ బాబు కూతురు సితార అలా చేస్తుందట!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel