Jr NTR : ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడానికి ఆ దోషమే కారణమా… అందుకే దీక్ష తీసుకున్నారా?

Jr NTR : సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పలు రకాల స్వామి మాలలు వేస్తూ దీక్ష చేయటం మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, శర్వానంద్, రామ్ చరణ్, అఖిల్ వంటి హీరోలు అయ్యప్ప మాలలు వేసి దీక్ష చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా హనుమాన్ దీక్ష తీసుకున్నారు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో రామ్ చరణ్ అయ్యప్ప మాల అదే బాటలోనే ఎన్టీఆర్ హనుమాన్ మాల వేశారు. అయితే ఎన్టీఆర్ హనుమాన్ మాల వేయడం వెనక మరొక కారణం కూడా ఉందని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

Jr NTR
Jr NTR

ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉండటం వల్ల ఆ దోష నివారణ కోసం హనుమాన్ మాల వేసినట్లు ఆయన సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ దోషం ఏమిటి అనే విషయానికి వస్తే….సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో సినిమా చేసిన ఆ హీరో తదుపరి చిత్రం ఫ్లాప్ అవుతుందని సెంటిమెంట్ కొనసాగుతూ ఉంది. ఈ సెంటిమెంట్ ప్రతి ఒక్క హీరో విషయంలో కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ అందుకోవడంతో వారు తదుపరి చిత్రాలపై ఆ సెంటిమెంట్ ప్రభావం పడుతుందని భావించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ప్రభావం తన తదుపరి సినిమా పై పడకుండా దోష నివారణ కోసం హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు సమాచారం.అదే విధంగా ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్న ఎన్టీఆర్ దోష నివారణ కోసం త్వరలోనే ఒక హోమం కూడా చేయనున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఇలా తనపై ఉన్న దోషం తొలగిపోకపోతే ఎన్టీఆర్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ త్రిబుల్ఆర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా, తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

Read Also : Hero Balakrishna : బాలయ్య బాబుకు సర్జరీ ప్రచారం.. నిజమేనా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel