Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Mahesh Babu: కొన్ని క్షణాలలో విడుదల కానున్న మహేష్ సర్కారీ వారి పాట టైటిల్ సాంగ్!

Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని పో

By Ramesh Babu

Published on: April 23, 2022 11:00 AM

Updated on: April 23, 2022 10:04 AM

---Advertisement---

Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ఇక ఈ సినిమాని వచ్చే నెల 12వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్లను విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

pjimage 2022 04 23T100517.221ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మూడవ పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని క్షణాలలో ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల కానుంది. నేడు ఉదయం 11 గంటల7 నిమిషాలకి సర్కారీ వారి పాట టైటిల్ సాంగ్ విడుదల కానుంది. ఈ పాట కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

c3118a92 78e4 4518 ac43 c2164273fef7మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే మూడవ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ సినిమాలో పెన్నీ సాంగ్ లో కనిపించి అభిమానులను సందడి చేశారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.