Andharu Bagundali Movie Review : మళయాళం సూపర్ హిట్ అయిన మూవీ ‘వికృతి’. దీనిని తెలుగులో ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే టైటిల్‌తో రీమెక్ చేశారు. ప్రముఖ హాస్యనటుడు అలీ ఇందులో హీరోగా నటించాడు. అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై ఈ మూవీని శ్రీపురం కిరణ్ తెరకెక్కించాడు. సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రధారులు పోషించగా.. మౌర్యాని హీరోయిన్‌గా చేసింది.ఈ మూవీ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ రివ్వ్యూ మీకోసం..
అసలు స్టోరీ ఇదే (Story) :
నరేష్ ఈ మూవీలో శ్రీనివాసరావు రోల్ చేయగా..పవిత్ర సునీత రోల్ చేసింది. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండే జంట. వయసు మీద పడుతున్నా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటుంటారు.కొడుకు కూతురితో హ్యాపీగా ఉన్న వీరి జీవితాల్లో అనుకోకుండా ఒక కుదుపు. అలీ (మహమ్మద్ సమీర్) తీసిన ఓ ఫోటో కారణంగా అల్లకల్లోలంగా మారుతాయి.
దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన మహమ్మద్ సమీర్‌కి సెల్ఫీల పిచ్చి. దానితోనే పెద్ద ఆపదలో చిక్కుకుంటాడు. ఆ సమస్య ఎమిటన్నది మూవీ స్టోరీ. ఆ తర్వాత అలీ దిల్ రుబాతో (మౌర్యాని) ఎలా ప్రేమలో పడ్డాడు..? వీళ్ల లవ్ పెళ్లివరకు వెళ్లిందా? లేదా.. చివరకు నరేశ్, పవిత్ర జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయన్నదే అసలు కథ..
Andharu Bagundali Movie Review : సినిమా ఎలా ఉందంటే?
సినిమా విశ్లేషణ పరంగా చూసుకుంటే పాత్రలు అన్నీ మన నిజజీవితంలో జరిగిన పాత్రలను చూస్తుంటాం. కథలోని సెన్సిటివిటీ, ఎమోషన్స్, ఫీల్ గుడ్ సీన్స్ ఈ మూవీకి మెయిన్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. భావోద్వేగమైన పాత్రలతో కూడా సున్నితమైన హాస్యాన్ని పండించిన విధానం చాలా బాగుంది. ప్రధానంగా నరేష్ – పవిత్రా లోకేష్ మధ్య ప్రేమ, బాధలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.కథనంలో ఎక్కడా ఫ్లో తగ్గకుండా చాలా చక్కగా కామెడీ, ఎమోషన్స క్యారీ చేశారు.
ఇక అలీ కామెడీ టైమింగే కాదు. హీరోగా కూడా చాలా బాగా మెప్పించాడు.తన పాత్రకు ప్రాణం పోశాడు. పక్కింటి ఫ్రెండ్ పాత్రలో సింగర్ మను ఆకట్టుకున్నాడు. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో లాస్య చక్కగా నటించింది. ఆమె వల్లే ఈ సినిమాలో టర్న్ వస్తుంది.
ప్లస్ పాయింట్స్…
అలీ నటన
నరేష్ – పవిత్రా లోకేష్ మధ్య కెమిస్ట్రీ ఎమోషనల్ సీన్స్..
మైనస్ పాయింట్స్..
సంగీతం
కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్
Read Also : Ori Devuda Movie Review : ‘ఓరి దేవుడా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే?