Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

ఉదయం పెయింటర్.. మధ్యాహ్నం కోటీశ్వరుడు.. ఎలాగంటే..?

అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అదృష్టం ఓ టికెట్ రూపంలో వస్తే.. అదే లాటరీ. ఈ లాటరీ అనేది ఎక్కువగా ఆశించేవారికంటే టైమ్ పాస్‌కు కొనే

By Ramesh Babu

Published on: January 18, 2022 2:20 PM

Updated on: January 18, 2022 1:55 PM

---Advertisement---

అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అదృష్టం ఓ టికెట్ రూపంలో వస్తే.. అదే లాటరీ. ఈ లాటరీ అనేది ఎక్కువగా ఆశించేవారికంటే టైమ్ పాస్‌కు కొనేవారినే ఎక్కువగా వరిస్తూ ఉంటుంది.ఈ లాటరీ అనేది ఇప్పటికీ ఎంతోమంది రిక్షావాలాలను, డ్రైవర్‌లను కోటీశ్వరులను చేసింది. తాజాగా కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిగా మార్చింది ఒక లాటరీ టికెట్.

635826 kerala
కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్ ఒలిపరంబిళ్.. ఓ పెయింటర్. అతడికి రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. తాజాగా అతడు కొన్న ఒక లాటరీ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. అయితే ఈసారి మాత్రం తాను లాటరీ టికెట్‌ను కావాలని కొనలేదని చెప్తున్నాడు సదానందన్.ఒకరోజు తాను ఓ షాపుకు వెళ్తుండగా తన దగ్గర ఉన్న రూ. 500 నోటుకు చిల్లర కోసం ఒక లాటరీ టికెట్‌ను కొన్నాడట సదానందన్.

Advertisement

ఆ రోజు మధ్యాహ్నానికే రిజల్ట్స్ వచ్చాయని, అప్పుడు ఈ విషయాన్ని తానే నమ్మలేకపోయానని అంటున్నాడు. సదానందన్‌కు సనీష్, సంజయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాటరీలో వచ్చిన రూ. 12 కోట్లతో తాను ఒక మంచి ఇల్లు కట్టుకోవడంతో పాటు తన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు సదానందన్.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :