WhatsApp Services : వాట్సాప్ ఈజ్ బ్యాక్.. ఫిక్స్ చేసిన వాట్సాప్.. మీ ఫోన్లలో చెక్ చేసుకోండి..!

WhatsApp Services : ప్రపంచ్యవాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు (Whatsapp Services) తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్ల వాట్సాప్ యాప్ డౌన్ అయింది. వాట్సాప్ అంతరాయం సమయంలో యూజర్లు తమ మెసేజ్‌లను పంపలేరు.

WhatsApp down for millions of users for over an hour. Update_ Now fixed
WhatsApp down for millions of users for over an hour. Update_ Now fixed

WhatsApp ఆడియో, వీడియో కాల్‌ల వంటి సర్వీసులను ఉపయోగించలేరు. వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్‌లో సమస్యలను నివేదించడం ప్రారంభించిన వెంటనే.. మెటా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాట్సాప్ సర్వీసులు త్వరలో రీస్టోర్ అవుతుందని తెలిపింది. అయితే, అంతరాయానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

WhatsApp Services : వాట్సాప్ నిలిచిపోయిన సమయంలో ఏం జరిగిందంటే? :

అవుట్‌టేజ్ ట్రాకర్ (outage tracker), డౌన్‌డెటెక్టర్ (Downdetector) ప్రకారం.. చాలా మంది వాట్సాప్ యూజర్లు ఈరోజు అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటలకు WhatsApp మొబైల్ యాప్, వెబ్‌తో సమస్యలను ఎదుర్కోన్నారు. ఆ సమయంలో, 2,000 మంది వినియోగదారులు వెబ్‌సైట్‌లో యాప్‌తో సమస్యలను నివేదించారు.

Advertisement

69 శాతం మంది వినియోగదారులు సందేశాలను పంపడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, 21 శాతం మంది వినియోగదారులు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్‌డెటెక్టర్ పేర్కొంది. అయితే కొన్ని కారణాల వల్ల దాదాపు 9 శాతం మంది వాట్సాప్ యూజర్లు తమ యాప్‌ను ఉపయోగించలేకపోయారు. వాట్సాప్ సర్వీసులు నిలిచిపోవడంతో WhatsAppDown అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

WhatsApp down for millions of users for over an hour. Update_ Now fixed
WhatsApp down for millions of users for over an hour. Update_ Now fixed

భారత్ సహా ఇతర దేశాలలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయిన తర్వాత WhatsApp పేరెంట్ మెటా ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతం కొంతమందికి మెసేజ్‌లను పంపడంలో సమస్య ఉందని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా అందరికీ WhatsAppని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

వాట్సాప్ ఎందుకు డౌన్ అయిందంటే?
వాట్సాప్ అంతరాయానికి గల కారణాన్ని మెటా ఇంకా స్పష్టం చేయలేదు. లక్షలాది మంది వినియోగదారుల కోసం ప్లాట్‌ఫారమ్ పనిచేయడం ఆగిపోవడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 2021లో ప్రపంచవ్యాప్తంగా WhatsApp సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో, DNS వైఫల్యం కారణంగా సర్వీసులు నిలిచిపోయాయని కంపెనీ తెలిపింది.

Advertisement

Read Also : Whatsapp Down : యూజర్లకు షాకింగ్ న్యూస్.. నిలిచిపోయిన వాట్సాప్ సర్వీసులు.. మీ డివైజ్ చెక్ చేసుకున్నారా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel