Whatsapp New Features : త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్… ఇక ఆ దిగులు ఉండదు !

Updated on: January 23, 2022

Whatsapp New Features : ప్రస్తుతం నేటి సమాజంలో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంటుంది. నవంబర్ 2021 నుంచి వరకు ఎన్నో కీలక ఫీచర్లను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది అని తెలుస్తుంది. గతంలో ఇది వాట్సాప్ కి ఒక విధంగా అతిపెద్ద లోపంగా ఉండేది. కానీ, ఇప్పుడు దాన్ని అధిగమించడానికి సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

త్వరలో ప్రజలు ఈ అద్భుతమైన ఫీచర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ మేరకు మెటా ఈ ఫీచర్‌పై పనిచేస్తుందని తెలుస్తోంది. వాట్సాప్ చాట్ బ్యాకప్ ఇకపై మరింత ఈజీ కానుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్ కి చాట్‌లను బదిలీ చేసేందుకు ఓ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం, ఐఓఎస్ నుంచి సామ్ సంగ్, పిక్సెల్ ఫోన్‌లకు చాట్ బ్యాకప్‌ను బదిలీ చేసే ఫీచర్‌ను కంపెనీ విడుదల చేసింది. త్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కి కూడా ప్రారంభించనుందని వాట్సాప్ సీఈవో విల్ క్యాత్‌కార్ట్ తాజాగా తెలిపారు.

Advertisement

ప్రస్తుతానికి మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని మార్చడం ద్వారా ఐఫోన్ కి మారి, వాట్సాప్ కి లాగిన్ చేస్తే, మీకు చాట్ బ్యాకప్ లభించదు. ఈ ఫీచర్‌ను పరీక్షించడానికి బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ 2.21.20.11 విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకునే ఆప్షన్ కనిపించింది. టెస్టింగ్ విజయవంతం అయిన తర్వాత, త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని సమాచారం.

Read Also : Ys Jagan : ఏపీ ప్రభుత్వానికి షాక్… సమ్మె బాట పట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు !

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel