Whatsapp Down : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ (Whatsapp) సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాదాపు గంట నుంచి వాట్సాప్ సర్వీసులు పనిచేయడం లేదు. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేయనున్నట్టు ఇటీవలే మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ వెల్లడించింది.
ఈ ఫోన్ డివైజ్ మోడళ్లలో అక్టోబర్ 24 నుంచి తమ సర్వీసులను నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. అందులోభాగంగానే అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ డివైజ్‌ల్లో సర్వీసులు నిలిచిపోయాయి. వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్ లను పంపేందుకు ప్రయత్నిస్తే.. వెయిటింగ్ సింబల్ అలానే ఉంటుంది. మెసేజ్ డెలివరీ కావడం లేదని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
iOS 10, iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఐఫోన్లలో ఇప్పటినుంచి వాట్సాప్ పనిచేయదు. ఇప్పటినుంచి iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5C ఫోన్లలో ఈ వాట్సాప్ సర్వీసులు పనిచేయవు. ఆపిల్ నిబంధనలు ప్రకారం.. iPhone 4, iPhone 4S డివైజ్ ల్లో ఇకపై OS అప్ డేట్ కాదని కంపెనీ తెలిపింది.
iPhone 5, iphone 5C మోడళ్లలో మాత్రమే OS అప్ డేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అందుకే ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలో iOS 12 వెంటనే అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది.
ఆండ్రాయిడ్ యూజర్లు కూడా 4.04 వెర్షన్ OSతో రన్ అవుతున్న ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వాట్సాప్ వెర్షన్‌కు తమ డివైజ్ లను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా వాట్సాప్ సూచించింది.
WhatsApp services have been down for the last 30 minutes. pic.twitter.com/9WL4mMFTRO
Advertisement— ANI (@ANI) October 25, 2022
Advertisement
Read Also : Spam Calls : స్పామ్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?