Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam july 18 Today Episode : హిమను తప్పుగా అపార్థం చేసుకున్న సౌర్య.. కోపంతో రగిలిపోతున్న నిరుపమ్..?

Karthika Deepam july 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ అన్న మాటలను సౌందర్య, ఆనందరావులకు చెప్పుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదివరకు ఎంగేజ్మెంట్ వద్దు అనింది ఆ ... Read more

By Ramesh Babu

Published on: July 18, 2022 8:36 AM

Updated on: July 18, 2022 11:59 AM

Karthika Deepam july 18 Today Episode :Sourya misunderstands Hima's intentions in todays karthika deepam serial episode

---Advertisement---

Karthika Deepam july 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ అన్న మాటలను సౌందర్య, ఆనందరావులకు చెప్పుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదివరకు ఎంగేజ్మెంట్ వద్దు అనింది ఆ తర్వాత నేను మమ్మీని బ్రతిమలాడి పెళ్లికి ఒప్పించాను ఇప్పుడు మళ్లీ సౌర్య ని పెళ్లి చేసుకోమని అంటుంది అంటూ కోపంతో మాట్లాడుతాడు నిరుపమ్. అప్పుడు సౌందర్య ఆనందరావులు, నచ్చ చెప్పడానికి ప్రయత్నించగా నిరుపమ్ మాత్రం కనీసం మీరైనా హిమకు చెప్పండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

 Karthika Deepam july 18 Today Episode :Sourya misunderstands Hima's intentions in todays karthika deepam serial episode
Karthika Deepam july 18 Today Episode :Sourya misunderstands Hima’s intentions in todays karthika deepam serial episode

ఆ తర్వాత సౌందర్య, ఆనంద్ రావు లు నిరుపమ్ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే హిమ అక్కడికి వస్తుంది. అప్పుడు సౌందర్య ఏంటి హిమ ఇది అని అడగగా నిరూపం బావకి సౌర్యకి ఎలా అయినా పెళ్లి చేస్తాను అందుకోసం ఏమైనా చేస్తాను అని అనడంతో సౌర్య అక్కడికి వచ్చి ప్రేమతో హిమ అని పిలుస్తుంది. నన్ను డాక్టర్ సార్ ని కలపడం కోసం నువ్వు ఇంతలా ఆరాటపడుతున్నావా, కానీ నేను నిన్ను శత్రువులా చూస్తున్నాను అంటూ ఎమోషనల్ గా హత్తుకుంటుంది శౌర్య.

Karthika Deepam july 18 Today Episode : కార్తీకదీపం జూలై 18 ఎపిసోడ్ కోపంతో రగిలిపోతున్న నిరుపమ్..

ఆ తర్వాత ఇలా మాట్లాడుతాను అని అనుకుంటున్నావా అంటూ వెంటనే సీరియస్ అవుతుంది. నేను మళ్ళీ నీ మాయలో పడిపోతాను నువ్వు అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు అని అనగా అప్పుడు హిమ జరిగిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించినా కూడా సౌర్య వినిపించుకోదు. అప్పుడు ఆనందరావు సౌందర్య వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించినా కూడా సౌర్య,హిమను మరింత అపార్థం చేసుకుంటుంది.

మరొకవైపు నిరుపమ్ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి ఏంటి నిరుపమ్ అలా ఉన్నావు మళ్లీ ఆ హిమ దగ్గరికి వెళ్లొచ్చావా అంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు నిరుపమ్ స్వప్న మీద సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య ఆనందరావు దంపతులు జరిగిన విషయాన్ని తలుచుకునే బాధపడుతూ ఉంటారు.

ఇంతలోనే సౌర్య అక్కడికి వచ్చి తను ఆటో తోలే విషయం గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆటోని తోలదు ఇకపై వదిలేయ్ అని అనగా సౌర్య మాత్రంవినిపించుకోకుండా ఆటో తోలుతాను అని అంటుంది. ఇంతలోనే హిమ కాపాడిన పాప తల్లిదండ్రులు బర్త్డేకి ఇన్వైట్ చేయడానికి వస్తారు.

అప్పుడు వాళ్లు ఈ పాపని హిమ మేడం కాపాడింది సౌర్య అని పేరు కూడా పెట్టింది అని అనడంతో వెంటనే సౌర్య వాళ్లతో స్వీట్ బాక్స్ తీసుకొని వాళ్ళని పంపించి డబ్బు ఇచ్చి మరి తన గురించి తన గొప్పగా చెప్పుకుంటుంది అంటూ మరింత తప్పుగా అపార్థం చేసుకుంటుంది.

మరొకవైపు నిరుపమ్,హిమ గురించి ఆలోచిస్తూ సత్య తో హిమను మాట్లాడించాలి అని అనుకుంటాడు. ఆ మాటకు స్వప్న కోపంతో రగిలిపోతూ ఉండగా వెంటనే నిరుపమ్ హిమా ఎన్ని చెప్పినా కూడా తనే నా భార్య అని స్వప్నకు తెగేసి చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు నిరుపమ్.

Read Also : Karthika Deepam july 16 Today Episode : పెళ్లి ఎలా అయినా ఆపేస్తాను అంటున్న ప్రేమ్..హిమపై సీరియస్ అయిన నిరుపమ్..?

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.