Karthika Deepam july 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య హిమపై కోపం ఫోటోపై చూపిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య కోపం ఉంటే నా మీద చూపించు. నన్ను చంపేయ్ అని హిమ అనగా వెంటనే సౌర్య చంపేయడాలు నీకు అలవాటు నాకు కాదు. మనుషుల ప్రాణాలను అవలీలగా తీయడం నీకు మాత్రమే తెలుసు నాకు తెలియదు అని అనడంతో హిమ బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సౌందర్య,ఆనందరావు లు కూడా బాధపడుతూ ఉంటారు. మరొకవైపు ప్రేమ్ స్వప్న అన్న మాటలను తలచుకొని ఎలా అయినా పెళ్లి ఆపాలి అని అనుకుంటాడు.

ఇక జ్వాలాకి ఆటో బేరం రావడంతో నేరుగా తన ఇంటికి వెళ్తుంది. సౌర్య ఆటో ఎక్కిన అతను ఆనందరావుకి ఫ్రెండ్. ఆ తర్వాత సౌర్య నేరుగా ఇంట్లోకి వెళ్లడంతో ఆనంద్ రావ్ ఫ్రెండ్ ఏంటి అమ్మాయి ఇంట్లోకి నేరుగా వచ్చేసావు నీ డబ్బులు నీకు ఇచ్చేశాను కదా అని అనగా మీకెందుకు సార్ నేను ఇంట్లోకి వస్తే నీకేమి అని అనడంతో ఈ అమ్మాయి మర్యాదగా మాట్లాడు అని అంటాడు అతను. ఇది మా ఇల్లే కావాలంటే అక్కడ నా ఫోటో కూడా ఉంది చూడండి ఇతను మా తాతయ్య అనడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.
Karthika Deepam july 16 Today Episode : హిమపై సీరియస్ అయిన నిరుపమ్..
మరొకవైపు హిమ హాస్పిటల్ లో కూర్చుని సౌర్య గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో ఇద్దరు దంపతులు పాపని తీసుకొని వచ్చి హిమని పుట్టినరోజు వేడుకకు ఇన్వైట్ చేయగా హిమ మాత్రం డబ్బు ఇచ్చి పాప జాగ్రత్త అని చెబుతుంది. మరొకవైపు సౌర్య తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడి నా పరిస్థితి ఇలా అయింది అంటూ ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత సౌర్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నిరుపమ్ అక్కడికి వచ్చి వెనుకవైపు నుంచి చూసి హిమ అనుకుని ఐ లవ్ యు చెబుతాడు. తర్వాత అక్కడ సౌర్య ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత నిరుపమ్, సౌర్యకు సారీ చెప్పి హిమ దగ్గరికి వెళ్లిపోతాడు. అప్పుడు హిమ సౌర్యని పెళ్లి చేసుకోమంటూ నిరుపమ్ కీ చెప్పగానే రూపం మాత్రం నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇష్టం లేదు అని ఎందుకు ఇలా బలవంతం పెడుతున్నావు అంటూ హిమపై సీరియస్ అవుతాడు.
మన పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అదే ముహూర్తానికి సౌర్య మెడలో తాళిబొట్టు కట్టు అని చెబుతుంది హిమ. అయితే వారిద్దరూ మాట్లాడుకుంటున్నా మాటలు అన్నీ కూడా సౌర్య బయట నుంచి వింటూ ఉంటుంది. ఆ తర్వాత నిరుపమ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఆనంద్ రావు ఏమయింది ఎందుకు అలా ఉన్నావు అని ప్రశ్నించగా ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది.
ఏంటి అమ్మమ్మ ఇది వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయిన తర్వాత కూడా హిమ పెళ్లి వద్దంటుంది తనకు మీరైనా చెప్పండి అంటూ కోప్పడతాడు నిరుపమ్. రేపటి ఎపిసోడ్ లో హిమ మనసు మీరైనా మార్చండి. మచ్చ చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న సౌర్య హిమను హత్తుకొని ఎమోషనల్ అవుతుంది.
Read Also : Karthika Deepam july 15 Today Episode : హిమను తలుచుకొని బాధపడుతున్న ప్రేమ్.. బాధతో కుమిలిపోతున్న హిమ..?