వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam : శోభకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హిమ.. స్వప్నపై విరుచుకుపడిన హిమ..?

Karthika Deepam June 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా, నిరుపమ్ కి తన మనసులో మాటను చెప్పేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో జ్వాలా, హిమ తో మాట్లాడుతూ డాక్టర్ సాబ్ కి నా మనసులో మాట చెప్పేసాను ఇక మిగిలింది మా పెళ్లి,మా పెళ్లి చేస్తానని ... Read more

By Ramesh Babu

Published on: June 21, 2022 8:48 AM

Updated on: June 21, 2022 10:05 AM

Karthika Deepam June 21 Today Episode

---Advertisement---

Karthika Deepam June 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా, నిరుపమ్ కి తన మనసులో మాటను చెప్పేస్తుంది.

ఈరోజు ఎపిసోడ్లో జ్వాలా, హిమ తో మాట్లాడుతూ డాక్టర్ సాబ్ కి నా మనసులో మాట చెప్పేసాను ఇక మిగిలింది మా పెళ్లి,మా పెళ్లి చేస్తానని నువ్వే చెప్పావు కదా తింగరి అది నీ బాధ్యత అన్నావు అని హిమతో అనగా అప్పుడు హిమ సరే అని అంటుంది. ఆ తర్వాత జ్వాలా మొన్న డాక్టర్ సాబ్ ఇంట్లో ఏం పార్టీ జరిగింది అని అడగగా స్వప్న పుట్టినరోజు అని చెప్పడంతో నేను ఆ పార్టీకి నా శత్రువు హిమ వల్ల రాలేకపోయాను అని అనడంతో టెన్షన్ పడుతుంది.

Karthika Deepam June 21 Today Episode
Karthika Deepam June 21 Today Episode

ఆ తర్వాత వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు సౌందర్య, హిమ క్యాన్సర్ విషయం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్లగా డాక్టర్ హిమ కు క్యాన్సర్ లేదు అని చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. హిమ తనకు బాగా తెలుసునని మొన్న బ్లడ్ కూడా ఇచ్చింది అని డాక్టర్ చెప్పడంతో సౌందర్య అక్కడినుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత శోభ ఇంటికి వెళ్లగా అక్కడ హిమను చూసి ఒక్క సారిగా షాక్ అవుతుంది. అప్పుడు హిమ, శోభతో వెటకారం గా మాట్లాడగా వెంటనే శోభ మాట్లాడుతూ హిమ బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం చెప్పడంతో అప్పుడు హిమ, శోభ పీక నా ఫ్యామిలీ జోలికి వస్తే జాగ్రత్త అని స్ట్రాంగ్ గా వార్ణింగ్ ఇస్తుంది. అప్పుడు శోభ సౌర్య గురించి,హిమ కు క్యాన్సర్ లేదు అన్న విషయం గురించి చెప్పడంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఆ తర్వాత హిమ ధైర్యం తెచ్చుకొని శోభతో వెటకారం గా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావంటే మర్యాదగా ఉండదు అంటూ శోభకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది హిమ. ఆ తరువాత సౌందర్య, హిమ ను కొట్టడంతో అక్కడికి ఆనంద్ రావ్ వచ్చి హిమ ను ఎందుకు కొడుతున్నావ్ అని అడగగా సౌందర్య హిమ క్యాన్సర్ లేదు అన్న విషయం చెప్పడంతో ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతాడు.

అప్పుడు వారు ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే నిరుపమ్,స్వప్న అక్కడికి వస్తారు. అప్పుడు స్వప్న, హిమ గురించి కాస్త పొగరుగా మాట్లాడడంతో సినిమా ఏమాత్రం తగ్గకుండా స్వప్నకు అదే రేంజ్ లో స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది. హిమ మాటలకు స్వప్న షాక్ అవుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, జ్వాలా తో మాట్లాడుతూ నేను నిన్ను ప్రేమించడం లేదు మీ తింగరిని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుంటున్నాను అని అనడంతో పక్కన చాటుగా సౌందర్య, హిమ వింటూ ఉంటారు. అప్పుడు హిమ జ్వాలానే సౌర్య అన్నవిషయాన్ని సౌందర్య కు చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam june 20 Today Episode : సౌర్య తనకు తెలుసంటూ షాక్ ఇచ్చిన శోభ.. రక్తంతో డాక్టర్ సాబ్ బొమ్మ వేసి ప్రపోజ్ చేసిన జ్వాల?

, , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel