Chinmay sripada : సింగర్ చిన్మయి శ్రీపాదకు కవల పిల్లలు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆమె, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదేంటి చిన్మయి తల్లైందా.. ఇంత వరకు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు, అసలు ఆమె ఎప్పుడు గర్భం దాల్చిందంటూ ఇలా నానా రకాల ప్రశ్నలతో ఆమెకు ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లో మెసేజ్ లు పంపుతున్నారట. అయితే వాటన్నిటికి సమాధానంగా చిన్మయి ఓ పోస్టును పెట్టింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

“నాకు ప్రగ్నెన్సీ వచ్చిందని, ఆ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయకపోవడంతో.. సరోగసి ద్వారా పిల్లల్ని కన్నావా, అని అడుగుతున్న వారందరికీ సమాధానం ఇలా చెప్పాలనుకుంటున్నాను.. నా క్లోజ్ సర్కిల్ లో ఉన్న వారికి మాత్రమే ఆ విషయం తెలుసు. అత్యంత సన్నిహితులకు మాత్రమే నేను గర్భవతిని అని తెలుసు. నేనే ఆ విషయాన్ని బయటకు రానివ్వలేదు. నాను నేనుగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలా చేశాను. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేయను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నా పిల్ల ఫోటోలను నెట్టింట్లో ఎప్పుడూ షేర్ చేయను. “అంటూ చెప్పుకొచ్చింది.
AdvertisementView this post on Instagram
Read Also : Chinmay sripada: పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయ్ శ్రీపాద..!